Site icon NTV Telugu

Ram Charan : నాటు నాటు పాటతో స్టేడియాన్ని ఊపేసిన రామ్ చరణ్..వీడియో వైరల్..

Cherry (3)

Cherry (3)

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ హాలీవుడ్ కు చేరింది.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యాడు.. ఆ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది.. చరణ్ సినిమాల కోసం ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తోన్న కావడంతో ఇప్పుడు అందరి చూపు ఈ మూవీ పైనే. అంతేకాకుండా ఇందులో తొలిసారి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..

ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి… ఇదిలా ఉండగా చరణ్ క్రికెట్ లీగ్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.. హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసినట్లు చరణ్ గతంలోనే ప్రకటించారు. టెన్నిస్ బాల్‏తో నిర్వహించే ఐఎస్పీఎల్ లీగ్‏లో హైదరాబాద్ టీంకు యజమానిగా ఉన్నారు.. సూర్య, అక్షయ్ కుమార్ వంటి స్టార్లు సైతం టీమ్ లను కొనుగోలు చేశారు..

ఇకపోతే తాజాగా ఐఎస్పీఎల్ టీ10 లీగ్ మహారాష్ట్రలోని థానేలో ప్రారంభమయ్యింది. దడోజి కోనదేవ్ స్టేడియంలో ఈరోజు జరిగిన ప్రారంభ వేడుకల్లో మెగా హీరో రామ్ చరణ్, సచిన్ టెండుల్కర్, రవిశాస్త్రి, సూర్య పాల్గొన్నారు.. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.. అక్కడ స్టేడియంలో చరణ్ క్రేజ్ మాములుగా లేదు.. నాటు నాటు పాటకు చీర్ లీడర్స్తో డ్యాన్స్ వేశారు.. ఆ పాటతో స్టేడియాన్ని ఓ ఊపు ఊపేశారు.. చరణ్ నాటు నాటు పాటకు, గర్ల్స్ తో కలిసి కాలు కదిపారు.. ఆ వీడియో వైరల్ గా మారింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. ఆ తర్వాత బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నాడు..

Exit mobile version