Peddi: పెద్ది పరుగులు.. ఎందాకా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను ఇప్పుడు ఒకటే ప్రశ్న వేధిస్తోంది… ‘పెద్ది’ అనుకున్న సమయానికి వస్తుందా? లేక మళ్ళీ వాయిదా పడుతుందా? అనే. నిజానికి దర్శకుడు బుచ్చిబాబు సానా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా చుట్టూ ఇప్పుడు ‘వాయిదా’ గుసగుసలు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వాయిదా పడిన ఈ సినిమాను ఏప్రిల్ 30న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ గట్టిగా నిర్ణయించుకుంది కానీ, ఇటీవల విడుదలైన లేటెస్ట్ పోస్టర్లో ఎక్కడా విడుదల తేదీ ప్రస్తావన లేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. సాధారణంగా రిలీజ్ డేట్ లాక్ చేసిన సినిమాలు ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌లోనూ ఆ తేదీని హైలైట్ చేస్తాయి కానీ పెద్ది విషయంలో అలా జరగకపోవడం, సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలను ఇస్తోంది.
READ MORE: Pakistan: ఆపరేషన్ సిందూర్ మర్చిపోయారేమో.. భారత్‌కే వార్నింగ్ ఇస్తున్న పాక్ రక్షణమంత్రి..
Also Read
ప్రస్తుతం చిత్ర యూనిట్ కాలాన్ని మించిన వేగంతో ఊరుకులు పరుగులు పెడుతూ పని చేస్తోంది. అయితే కొన్ని కీలక అడ్డంకులు టీమ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి కానీ సినిమాలో అత్యంత కీలకంగా భావిస్తున్న మాస్ నెంబర్ (ఐటమ్ సాంగ్) షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ సహా డబ్బింగ్ పనులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వాస్తవానికి ఏప్రిల్ 30కి సినిమా రావాలంటే ఈ పాటికే ఫస్ట్ కాపీ సిద్ధం కావాలి. కానీ ప్రస్తుత వేగం చూస్తుంటే అది అసాధ్యంగా కనిపిస్తోందని ఇండస్ట్రీ టాక్. అయితే వచ్చే రెండు మూడు రోజుల్లో పెద్ది విడుదలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏప్రిల్ 30 మిస్ అయితే, సినిమా ఏకంగా మే నెలాఖరుకు లేదా జూన్‌కు వెళ్లే ప్రమాదం ఉంది. రామ్ చరణ్ కెరీర్లో భారీ డిజాస్టర్ అయిన ‘గేమ్ ఛేంజర్’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో నాణ్యత కోసం కాస్త ఆలస్యమైనా పర్లేదని కొందరు అంటుంటే, పదే పదే వాయిదాలు పడితే బజ్ తగ్గుతుందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
India-China Border Tensions: అరుణాచల్ సరిహద్దులో చైనాతో ఇంకా ఉద్రిక్తతలు.. ITBP డీజీ కీలక ప్రకటన
-
Kajal Aggarwal-Ramayana: ‘రామాయణ’లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన!
-
Gold Rates: మరో సారి భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే..
ట్రెండింగ్
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!