Site icon NTV Telugu

Ramcharan: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. అంతర్జాతీయ అవార్డు నామినేషన్లలో రామ్ చరణ్

Pop Golden Awards 2023

Pop Golden Awards 2023

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు ఎల్లలు దాటింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన నటన విమర్శకుల నుంచి ప్రేక్షకుల వరకు అందరినీ ఆకట్టుకుంది. రామ్ పాత్రలో నటన గురించి లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ప్రస్తావించారంటే… చరణ్ పర్ఫామెన్స్ ఎంత ఎఫెక్ట్ చూపించిందనేది అర్థం చేసుకోవచ్చు. ఆర్‎ఆర్ఆర్ సినిమా రామ్ చరణ్ నటనను మరో స్థాయిలో నిలబెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమాకు నామినేషన్లు సాధించి పెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమాలో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు సాధించిపెడుతోంది.

Read Also:Kuwait: షాపింగ్ మాల్ లో గొడవ.. ఎంత పెద్ద శిక్ష విధించారో తెలిస్తే షాక్ అవుతారు

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటున్న రామ్ చరణ్ వ్యక్తిత్వం చూసి విదేశీయులు కూడా ఆయన అభిమానులుగా మారుతున్నారు. ఇటీవల హైదరాబాద్ ఎయిర్ పోర్టులో చెప్పులు లేకుండా నడవడం నుంచి అమెరికాలో దిగడం వరకు ఆయన ప్రతి అడుగును అభిమానులు, ప్రేక్షకులు ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ రామ్ చరణ్ చేస్తున్న మూవీ గురించి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. హీరోగా ఆయనకు ఇది 15వ సినిమా. ఆ తర్వాత సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు.

Read Also:China: ప్రజల దృష్టిని మళ్లించే పనిలో డ్రాగన్ కంట్రీ.. అరుణాచల్, తైవాన్‌పై దాడికి ప్లాన్ చేస్తుందా..?

ఇది ఇలా ఉంటే.. ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన ఆర్‌ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు ప్రతిష్టాత్మక అవార్డులు ఈ సినిమాకి దక్కాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ భారీ క్రేజ్‌తో గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా లేటెస్ట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు సినీ వర్గాల్లో మరోసారి మార్మోగుతోంది. ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డు అయిన పాప్ గోల్డెన్ అవార్డ్స్‌కు ఇండియా నుంచి బాలీవుడ్ నటుల ఆఖరి జాబితా వ‌చ్చింది. అందులో పలువురు బాలీవుడ్ స్టార్స్‌తో సహా మన తెలుగు హీరో రామ్ చరణ్ పేరు కూడా ఉంది. ఆయన కూడా ఆ అవార్డులకు నామినేట్ అయ్యాడు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఈ అవార్డు ఈవెంట్ యూఎస్ లో జరగబోతుంది.

Exit mobile version