Site icon NTV Telugu

Ramcharan: మెగా ఫ్యాన్స్‎కు పూనకాలే.. హాలీవుడ్‎కు రామ్ చరణ్

Ram Charan

Ram Charan

Ramcharan: ట్రిపుల్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‎గా మారిపోయారు. ఇప్పటికే ట్రిపుల్ఆర్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయి కలెక్షన్ల దుమ్ము దులిపేస్తోంది. రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. రికార్డులతో పాటు అవార్డులను కూడా చిత్రం సొంతం చేసుకుంటుంది. ఈ చిత్రం రామ్ చరణ్‎కు ఓ రేంజ్ స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో ఆయన నటనకు ఫ్యాన్స్ దాసోహం అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు సైతం రామ్ చరణ్ నటనను మెచ్చుకుంటున్నారు. దీంతో ఇప్పుడు హాలీవుడ్ సైతం రామ్ చరణ్‎కు గ్రాండ్ వెల్కమ్ అంటోంది.

Read Also: Elon Musk: అలా జరుగుతోంది.. కాబట్టే ఇలా ఉద్యోగులను తీస్తేస్తున్నాను

తన సూపర్ హిట్టు సినిమాలతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఇప్పుడు హాలీవుడ్‌నే ఏలేందుకే రెడీ అవుతున్నారు. హాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ప్రధాన పాత్రపోషిస్తున్నారు. ఐరన్ మ్యాన్‌ సిరీస్‌లో రామ్‌ చరణ్ కీ రోల్‌ పోషిస్తున్నారని టాక్. ట్రిపుల్ ఆర్ సినిమాలోని తన సీతారామ పాత్రతో ఇండియాకే రాముడిగా మారిపోయిన రామ్ చరణ్.. అదే క్యారెక్టర్తో.. ప్రపంచానికి ఓ సూపర్ హీరోగా మారారు. అటు పోలీస్‌గా.. ఇటు అడవిలో అల్లూరిలా.. రెండు విభిన్న పాత్రల్లో అదిరిపోయే ఫర్మామెన్స్ ఇచ్చారు. ఆయన నటన చూసిన హాలీవుడ్ డైరెక్టర్లు చప్పట్లు కొట్టించుకున్నారు. ఇక ఇప్పుడు ఇదే క్యారెక్టర్ తో హాలీవుడ్ సినిమాలో రామ్ చరణ్ నటించబోతున్నట్లు సమాచారం.

Exit mobile version