Site icon NTV Telugu

Ram Charan : ‘నేను’ పుస్తకాన్ని రామ్ చరణ్ కు ఇచ్చిన బ్రహ్మానందం .. చరణ్ న్యూ లుక్ అదుర్స్..

Charan Bramhanandam

Charan Bramhanandam

గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ త్రిపుల్ ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను శంకర్ రూపోనందిస్తున్నారు.. ఈ సినిమాను పాన్ ఇండియా భారీ ప్రాజెక్టుగా ప్రకటించారు.. ఇప్పటిదాకా ఒక్క పోస్టర్ తప్ప ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అప్పుడప్పుడు షూటింగ్స్ నుంచి లీక్ అయిన వీడియోలు, ఫొటోలు చూసి కాసేపు సంతోషపడటం తప్ప చరణ్ అభిమానాలు ఈ సినిమా విషయంలో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు…

ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవ్వబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా గేమ్ ఛేంజర్ సెట్స్ నుంచి చరణ్.. బ్రహ్మానందంతో దిగిన ఫొటో పోస్ట్ చేశాడు. బ్రహ్మానందం ఇటీవల ‘నేను – మీ బ్రహ్మానందం’ అనే పేరుతో తన ఆత్మకథని పుస్తక రూపంలో తీసుకొచ్చారు.. ఈ బుక్ లో బ్రహ్మీ చిన్ననాటి విశేషాలతో పాటు, సినిమాల గురించి కూడా వివరంగా రాశారు..

ఈ బుక్ ను చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు నేను పుస్తకాన్ని గేమ్ ఛేంజర్ సెట్లో రామ్ చరణ్ కి అందించారు. దీంతో బ్రహ్మానందం పుస్తకాన్ని అందిస్తున్న ఫొటోని చరణ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. బ్రహ్మానందం గారి అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని ‘నేను’ పుస్తకంలో చాలా హాస్యంగా, హృదయానికి హత్తుకునేలా రాశారు.. రామ్ చరణ్, బ్రహ్మనందం ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో చరణ్ కొత్త లుక్ లో కనిపించాడు. ఈ లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫొటోలో చరణ్ క్లీన్ షేవ్ తో, ఒత్తైన జుట్టుతో, ఫార్మల్ షర్ట్ వేసుకొని ఓ యువ రాజకీయ నాయకుడిలా ఉన్నారు.. ఆ సినిమాలో నాలుగు పాత్రల్లో చరణ్ కనిపించబోతున్నారని లీకైన ఫోటోలను చూస్తే తెలుస్తుంది.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..

Exit mobile version