Site icon NTV Telugu

Rakul Preet Singh: ఆగ్రహంతో రెచ్చిపోయిన రకుల్ తండ్రి.. అది నా కూతురి కష్టం అంటూ..

Rakul Preet Singh

Rakul Preet Singh

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ పై ఎప్పటికప్పుడు కొత్త రూమర్స్ రావడం కామన్. ముఖ్యంగా హీరోయిన్ సంబంధించిన విషయాలలో ఈ రూమర్స్ కాస్త ఎక్కువనే వస్తాయని చెప్పవచ్చు. అసలేమీ జరగకపోయినా సరే., కొన్నిసార్లు ఎవరో ఒకరు పుకార్లను పుట్టిస్తారు. ఇకపోతే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇలా కల్పించిన కొన్ని రూమర్స్ కు ఇబ్బందులను ఎదురుకొంది. ఆ రూమర్ తో ఆవిడతో పాటు తన ఫ్యామిలీ కూడా అనేక ఇబ్బందులు పడిందని ఆమె తెలిపింది. రకుల్ ఫామ్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల తాకడితో ఆవిడ కాస్త సినిమా చాన్సులు తగ్గాయి. ఇదిలా ఉండగా ఓసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కి సంబంధించిన విషయంలో కూడా రకుల్ పేరు గట్టిగా వినిపించింది. అయితే ఆ విషయం పై తర్వాత ఎటువంటి విషయాలు బయటకు రాలేదు. కాకపోతే ఓ రూమర్ మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుంది. ఈ విషయాలు సంబంధించి ఒకసారి రకుల్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ చాలా కామన్. నిజం కాకపోయినా ఏదో ఒకటి సృష్టిస్తూ ఉంటారని., తన ఫ్యామిలీ కూడా తెలుసునని అయితే ఒక్కోసారి అలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తే సహజంగా కోపం వస్తుందని తెలిపింది.

TSRTC To TGSRTC: ఇకపై టీఎస్ఆర్టీసీ పేరు కాస్త ‘టీజీఎస్ఆర్టీసీ’ గా పేరు మార్పు..

ఇందులో భాగంగానే తను హైదరాబాదులో ఓ లగ్జరీ హౌస్ కొన్నానని.. అందుకు నా కష్టంతో ఇల్లు కొనుక్కుంటే., ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారని పుకార్లు పుట్టించారని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో మా నాన్న ఢిల్లీలో ఉన్నారని., ఆయనకీ తన సంపాదన గురించి.. అలాగే నేను పడే కష్టం గురించి తనకి మొత్తం తెలుసునని తెలుపుతూ తనకి లగ్జరీ హోసింగ్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు వచ్చిన వార్తలను చూసి ఆయన చాలా కోపద్రికుడయ్యాడని తెలిపింది. ఆ సమయంలో నా మేనేజర్ కు మా నాన్న ఫోన్ చేసి చాలా కోపంగా అరిచేశారంటూ ఆవిడ తెలిపింది. ఆ ఇల్లు నా కూతురు కష్టమైతే ఇంకెవడో ఇచ్చారంటూ అసలు ఎలా అలాంటి వార్తలు రాస్తారని మేనేజర్ ను తిట్టేశారని తెలిపింది. దాంతో తాను ఫోన్ తీసుకొని ఇక్కడ అంతే నాన్న వాడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సర్ది చెప్పినట్లు తెలిపింది.

Exit mobile version