NTV Telugu Site icon

Rakul Preet Singh: హైదరాబాదులో రకుల్ కొత్త ‘ఆరంభం’..

12

12

టాలీవుడ్ ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాదులో సరికొత్త రెస్టారెంట్ ను మొదలుపెట్టింది. ‘ఆరంభం’ పేరుతో హైదరాబాద్ మహానగరంలో ఓవ్ వెజ్ రెస్టారెంట్ ను మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం సంబంధించి సోషల్ మీడియాలో అనేక ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇదివరకు రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ వ్యాపారంలో అడుగుపెట్టిన సంగతి విధితమే. ఇందులో భాగంగానే హైదరాబాద్, వైజాగ్ మహానగరాలలో F-45 పేరుతో జిమ్ లను ఏర్పాటు చేసి వ్యాపారం చేసింది. ఇక ఈ జిమ్ లకు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం వెళ్తుంటారు.

Also Read: War 2 : ‘వార్ 2 ‘ షూటింగ్ పిక్స్ లీక్.. వైరల్ అవుతున్న హృతిక్, ఎన్టీఆర్ లుక్..

కేవలం ఈ బిజినెస్ మాత్రమే కాకుండా వెల్ బీయింగ్ న్యూట్రీషియన్, వెల్నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్ కు సంబంధించి ఈవిడకు పార్టనర్షిప్ కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా నేరుగా ఫుడ్ ఇండస్ట్రీ వ్యాపారం లోకి ఎంటర్ ఇచ్చింది ఈ సొగసరి. ఆరంభం పేరుతో మొదలైన ఈ రెస్టారెంట్లో కేవలం మిల్లెట్స్ తో చేసిన వంటకాలు మాత్రం లభించబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Jai Hanuman : ‘జై హనుమాన్’ నుంచి స్పెషల్ అప్డేట్.. వైరల్ అవుతున్న పోస్టర్..

ఈ మధ్యకాలంలోనే రకుల్ ప్రీత్ సింగ్ తన వైవాహి జీతంలోకి అడుగు పెట్టింది. యాక్టర్ కం ప్రొడ్యూసర్ గా రాణిస్తున్న జాకీభగ్నానీతో ఏడడుగులు నడిచింది. గోవాలో జరిగిన వీరి వివాహం కొద్దీ మంది సన్నిహితులు, బంధు మిత్రుల మధ్య మాత్రమే జరిగింది.

Show comments