కొండ పొలం తర్వాత టాలీవుడ్‌కు దూరంగా ఉంటోన్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌కే పరిమితమైంది. అక్కడేమైనా హిట్స్ ఉన్నాయా అంటే అదీ లేదు. అప్పుడెప్పుడో 2019లో వచ్చిన దే దే ప్యార్ దే తర్వాత హిట్టు అనేది ఎట్టా ఉంటుందో మర్చిపోయింది అమ్మడు. కేవలం తమిళ డబ్బింగ్ చిత్రాలు అయలాన్, ఇండియన్2తో హాయ్ చెప్పేసి సరిపెట్టేస్తోంది రకుల్. అవి కూడా డిజాస్టర్లే. గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రకుల్.. కెరీర్ ఫేడటవుతౌన్న దశలో ఆచితూచి ప్రాజెక్టులు సెలక్ట్ చేసుకుంటోంది.
Also Read : Bhagyashri Borse : భాగ్యానికి హిట్ భాగ్యం ఎప్పుడో..?
రకుల్ ఈ ఏడాది ‘మేరీ హస్బెండ్ కీ బీవీ’ ప్రేక్షకుల ముందకు వచ్చినా ఈ సినిమా ఒకటి వచ్చిందన్న విషయం కూడా జనాలకు తెలియకుండా వెళ్లిపోయింది. ఇక హోప్స్ అన్నీ ‘దేదే ప్యార్ దే’ సీక్వెల్ పైనే. అజయ్ దేవగన్‌తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది రకుల్ ప్రీత్ సింగ్. మాధవన్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకు అన్షుల్ శర్మ డైరెక్టర్. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే పతి పత్నీ ఔర్ ఓ2లో కూడా నటిస్తోంది కానీ ఇందులో సారా ఆలీఖాన్, వామికా గబ్బీలతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది పంజాబీ గుడియా. ఇక ఇండియన్ 3లో ఉందన్న మాటే కానీ సినిమా తెరకెక్కుతుందో లేదో టీంకే క్లారిటీ లేదు. ఇక తెలుగు తెరకు పంజాబీ బ్యూటీ దూరమైనట్లే కనిపిస్తోంది. తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు రకుల్. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో నటించిన రకుల్ కు ఇప్పుడు తెలుగులో ఆకాశం ఇచ్చే హీరోలు కనిపించడం లేదు. పరిస్థితి చూస్తే తెలుగులో రకుల్ దుకాణం సర్దేసినట్టే.
