NTV Telugu Site icon

Rakul Preet Son Gay : కొడుకు ‘గే’ అని తెలిస్తే చెంపపగుల కొడతానన్న రకుల్ ప్రీత్

rakul

rakul

Rakul Preet Son Gay : టాలీవుడ్ టు బాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు రకుల్ ప్రీత్ సింగ్. అగ్రకథానాయికగా దాదాపు అందరి హీరోల సరసన చేసి టాప్ ప్లేసుకు చేరుకున్నారు. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ లో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం సినిమాలో చివరిసారిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయలేదు. ఇటీవల డాక్టర్ జీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్.. ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు.

Read Also: RRR Wins International Award: వసూళ్లలో రికార్డులు, అవార్డులు.. తగ్గని ట్రిపుల్ఆర్ క్రేజ్

ఇది ఇలా ఉంటే.. కొద్ది రోజులుగా రకుల్ డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఆమె వివాహం జరగనున్నట్లు వార్తలు రావడంతో.. రకుల్ వాటిని ఖండించింది. ఈ మధ్య తాను గతంలో చేసిన కొన్ని వీడియోలే ఇప్పుడు నెట్టింట్ హాట్ టాపిక్‏గా మారాయి. తన కొడుకు కనుక గే అని తెలిస్తే అతడి చెంప పగలగొడతాను అని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Read Also: Dhoni First Production: ధోని ఫస్ట్ సినిమాకు హీరోయిన్ దొరికేసింది

2011లో మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొన్న రకుల్ కు.. ఒకవేళ మీ కొడుకు గే అని తెలిస్తే ఏం చేస్తారు అని ప్రశ్నించగా.. రకుల్ స్పందిస్తూ.. ” ఒకవేళ నా కుమారుడు గే అయితే.. ఆ విషయం తెలిసిన వెంటనే షాకవుతాను. వెంటనే అతడి చెంప పగలకొడతాను. కానీ ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తాను. తను అలాగే బతకాలనుకుంటే దాని వల్ల నాకు ఎలాంటి సమస్య లేదని చెప్పడమే కాకుండా.. ఆ దారిలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో తనకు సాయం చేస్తాను”. అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.