NTV Telugu Site icon

Rakul Preet Singh : పెళ్లి తర్వాత భర్త తో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన రకుల్.. వీడియో వైరల్..

Rakul (4)

Rakul (4)

బాలీవుడ్ లవ్ బర్డ్స్ రకుల్ ప్రీత్ సింగ్,జాకీ భగ్నానీ ఇటీవలే మూడు ముళ్లతో వివాహబంధంలోకి అడుగు పెట్టారు.. దాదాపుగా మూడేళ్లు ప్రేమించుకొని పెళ్లితో ఒక్కటయ్యారు..ఫిబ్రవరి 21న ఏడడుగులు వేసేసారు. గోవాలో కుటుంబసభ్యులు మరియు సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్లి అయిన దగ్గర నుంచి మ్యారేజ్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు రకుల్.. తాజాగా ఓ వీడియో షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

పెళ్లి తర్వాత మొదటి సారి తన భర్తతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను నెట్టిం అభిమానులతో పంచుకుంది.. అయితే ఈ డాన్స్ రీల్ ఒక ఛాలెంజ్ లో భాగంగా చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా ఛోటే మియా’. ఈ మూవీ నుంచి ఇటీవల ‘మస్త్ మలంగ్ ఝుమ్’ అనే పాటని రిలీజ్ చేశారు.. అయితే ఈ పాటను టైగర్ షాఫ్ర్ రీ క్రియేట్ చేశారు..

అంతేకాదు.. ఆ వీడియోను రీ క్రియేట్ ఛాలెంజ్ ను విసిరారు.. బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, రకుల్, జాకీ భగ్నానీ అండ్ తన ఫ్యాన్స్ కి ఛాలెంజ్ ఇచ్చారు. ఆ పాటలోని స్టెప్పులను రీ క్రియేట్ చేస్తూ రీల్ చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇక టైగర్ ఇచ్చిన ఛాలెంజ్ ని అంగీకరిస్తూ.. రకుల్ అండ్ జాకీ కలిసి ఆ డాన్స్ వీడియో చేశారు.. కొత్త జంట స్టెప్పులకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.. చాలా బాగా చేశారని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. దాంతో ఈ వీడియో ట్రెండ్ అవుతుంది.. ఒకసారి ఆ వీడియో పై లుక్ వేసుకోండి..