Site icon NTV Telugu

Rakul Preet Singh: మేకప్ మ్యాన్ కల నెరవేర్చిన రకుల్

Rakul Preet Singh

Rakul Preet Singh

Rakul Preet Singh: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్‌లకు వివిధ సినిమాలలో మేకప్ వేస్తూ వచ్చిన ప్రముఖ మేకప్ మాన్ కడాలి చక్రవర్తి(చక్రి) తన సొంతంగా ఒక మేకప్ స్టూడియో ప్రారంభించారు. పంజాగుట్టలో తన సొంతంగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” పేరుతో ఏర్పాటు చేసిన మేకప్ స్టూడియోను ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

READ ALSO: Illicit Relationship: ప్రియుడితో కలిసి.. భర్తను గొంతు నులిమి చంపిన భార్య.. సంచలన విషయాలు వెలుగులోకి

ఈ సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ… చక్రి సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడమీ పేరిట తన సొంత మేకప్ స్టూడియోను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన ఫస్ట్ సినిమా నుంచి చక్రి సుమారు 8 సంవత్సరాల పాటు తన అన్ని సినిమాలకు మేకప్ చేసినట్లు తెలిపారు. తను సొంతంగా ఒక మేకప్ అకాడమీ ప్రారంభించడం అనేది ఆయన కల అని అది నేడు నెరవేరిందని అన్నారు. ఈ సందర్భంగా మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు రకుల్ ప్రీత్ సింగ్ సమాధానం ఇస్తూ… ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు చేయకపోవడం వల్ల తెలుగు సినిమాలను, తెలుగువారిని ఎంతగానో మిస్ అవుతున్నాను అని అన్నారు. తప్పకుండా తాను తెలుగులో సినిమాలు చేస్తానని, తనకు తొలివిజయం అందించింది తెలుగు సినిమానే అని అన్నారు. ఒక చక్కటి కథ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇటీవల విడుదలైన అఖండ తాండవం చిత్ర విజయానికి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

READ ALSO: Bangladesh: బంగ్లాదేశ్‌లో హింస, భారత వ్యతిరేక అల్లర్లతో ఎవరికి లాభం..?

Exit mobile version