NTV Telugu Site icon

Rakshith Shetty : ఓటీటీ సంస్థల పై హీరో సంచలన వ్యాఖ్యలు..

Rakshit Shetty Wife Age Movies Facts

Rakshit Shetty Wife Age Movies Facts

కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ రక్షిత శెట్టి పేరు అందరికీ తెలిసే ఉంటుంది.. ఈయన తాజాగా ఓటీటీ సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.. 777 చార్లీ, సప్త సాగరాలు దాటి వంటి చిత్రాలతో టాలీవుడ్‌కు దగ్గరైన ఈయన తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా ఓటీటీ సంస్థల పై మండిపడ్డారు.. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఈ హీరో నిర్మాతగా తెరకెక్కించిన ఏకం వెబ్‌ సీరిస్‌ త్వరలోనే విడుదల కానుంది. ఈ సిరీస్‌ రిలీజ్‌ చేసేందుకు దాదాపు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నారు… కానీ ఇప్పటివరకు ఒక్క ఓటీటీ ప్లాట్ ఫామ్ కూడా ముందుకు రాలేదు దాంతో ట్విటర్ వేదికగా సంస్థల పై కోపడ్డారు.. ఆయన ట్వీట్ లో రాస్తూ.. జనవరి 2020లో ఏకమ్‌ సిరీస్‌ రిలీజ్ చేద్దామనుకున్నాం. కన్నడలో వెబ్ సిరీస్‌కి అదే సరైన సమయం అనిపించింది.. కరోనా వల్ల దానికి బ్రేక్ పడింది.. మేలో అనుకున్నాం.. ఫైనల్ చేసాము కానీ ఓటీటీ కోసం ఎదురు చూసాము కానీ ఒక్కటి కూడా ముందుకు రాకపోవడం అసంతృప్తిని వ్యక్తం చేసింది..

తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం కు కంటెంట్‌కే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. కన్నడ కంటెంట్‌ను ఎందుకు కొనుగోలు చేయడం లేదో అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. పెద్ద హిట్ సినిమాలను మాత్రమే ఓటీటీలోకి తీసుకుంటున్నారు.. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అందరికన్నా కన్నడ పరిశ్రమ వెనకుందని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..