Site icon NTV Telugu

RAAKA : గురువు చేయలేనిది.. శిష్యుడు చేస్తున్నాడా?

Raaka

Raaka

అల్లు అర్జున్ ‘రాకా’ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌తో సోషల్ మీడియాలో ఎన్నో కథలు పుట్టుకొస్తున్నాయి. కానీ, డైరెక్టర్ అట్లీ అసలు ఎలా ప్లాన్ చేస్తున్నాడనేది అంచనా వేయకుండా ఉంది. అయితే, రాకా లుక్ మాత్రం ఇదేదో కొత్త ప్రయోగంలా కనిపిస్తోంది. విచిత్రమైన అనిమల్‌ను పోలిన బన్నీ లుక్‌ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రమని, మానవ డిఎన్ఏ మార్పుల వల్ల మనిషి ఒక క్రూరమైన ప్రాణిగా మారే కథాంశంతో సూపర్ ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది.

అయితే, నిజానికి స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా గతంలోనే ఇలాంటి సినిమా చేస్తున్నాడని గట్టిగా నమ్మారు ఆడియెన్స్. స్టార్ హీరో విక్రమ్‌తో శంకర్ చేసిన ‘ఐ’ సినిమా ఇలాంటి కాన్సెప్ట్‌తోనే వస్తుందని.. రిలీజ్‌కు ముందు అంతా భావించారు. ఎందుకంటే, ఐ సినిమా కోసం విక్రమ్ చాలా కష్ట పడ్డాడు. ముఖ్యంగా క్రూరమైన మృగం లాంటి మేకోవర్ సినిమా పై ఎక్కడా లేని హైప్ క్రియేట్ చేసింది. శంకర్ సినిమాలంటేనే ఊహకతీతంగా ఉంటాయి. ‘ఐ’ కూడా అలాగే ఉంటుందని అనుకున్నారు. కానీ, కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యాక.. రివేంజ్ లవ్ స్టోరీతో షాక్ ఇచ్చాడు శంకర్. అంతేకాదు, విక్రమ్ అనిమల్ లుక్‌ను జస్ట్ ఒక్క పాటతోనే సరిపెట్టాడు. ఫలితంగా సినిమా ఫ్లాప్ అయింది. కానీ, ఇప్పుడు ‘రాకా’ లుక్ చూస్తుంటే.. గురువు చేయలేనిది శిష్యుడు అట్లీ చేస్తున్నాడా? అనే సందేహాలు రాకమానదు. ఫక్తూ కమర్షియల్ సినిమాలు తీయడంలో అట్లీ దిట్ట. కానీ, రాకా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది తన 18 ఏళ్ల కల అని చెప్పుకొచ్చాడు. కాబట్టి.. ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి. పైగా పుష్ప వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో.. రాకా కాన్సెప్ట్ అంత ఈజీగా ఉండదనే చెప్పాలి. మరి రాకా ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version