NTV Telugu Site icon

Delhi: రాజ్యసభకు అశోక్‌చవాన్, జేపీ నడ్డా.. ఏఏ రాష్ట్రాల నుంచంటే..!

Ashok Chavan

Ashok Chavan

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్ (Ashok Chavan) లక్కీ ఛాన్స్ కొట్టేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రెండ్రోజులకే రాజ్యసభ (Rajya Sabha) సీటు దక్కేసింది. రెండ్రోజుల క్రితం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కమలం గూటికి చేరారు. తాజాగా ఆయనకు రాజ్యసభ సీటు కూడా దక్కింది. మహారాష్ట్ర (Maharashtra) కోటాలో ఆయనను రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ ప్రకటించింది.

అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) కూడా మరోసారి రాజ్యసభ సీటును దక్కించుకున్నారు. ఈసారి ఆయన గుజరాత్ నుంచి బీజేపీ ఎంపిక చేసింది. తాజాగా బీజేపీ విడుదల చేసిన జాబితాలో మహారాష్ట్ర నుంచి అశోక్‌చవాన్, గుజరాత్ నుంచి జేపీ నడ్డాను నామినేట్ చేసింది.

ఈనెల 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే గురువారంతో నామినేషన్ల ప్రక్రియ ముగినుంది. దీంతో ఆయా పార్టీలు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ (BJP) ప్రకటిస్తోంది. మధ్యప్రదేశ్ నుంచి డాక్టర్ ఎల్.మురుగన్, ఉమేష్ నాథ్ మహరాజ్, మాయా నరోలియా, బన్సీలాల్ గుర్జర్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. ఒడిశా నుంచి అశ్విని వైష్ణవ్‌ను రంగంలోకి దించింది.

సోమవారం రాజస్థాన్ నుంచి చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్‌లను రంగంలోకి దించింది. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం త్వరలో ముగుస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (కాంగ్రెస్), భూపేందర్ యాదవ్ (బీజేపీ) ఏప్రిల్ 3తో వారి పదవీకాలం ముగియనుంది.

15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న భారత ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. అదేరోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. రాజ్యసభ ఎన్నికలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి. ఇక రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుండగా.. నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 16న నిర్వహించబడుతుంది.