NTV Telugu Site icon

Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రాజీనామాకు రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం..

Vijaya Sai Reddy

Vijaya Sai Reddy

విజయసాయి రెడ్డి రాజీనామాకు ఆమోదం లభించింది. విజయసాయి రెడ్డి రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదించారు. విజయసాయి రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు పేర్కొంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ బులిటెన్ విడుదల చేశారు. కాగా.. విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ కానుంది.

Read Also: Gandhi Tatha Chettu : ‘గాంధీ తాత చెట్టు’ టీంకు రామ్ చరణ్, ఉపాసన అభినందనలు

కాగా.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని విజయసాయి రెడ్డి నిన్న (శుక్రవారం) ఎక్స్‌లో తెలిపిన సంగతి తెలిసిందే.. రాజ్యసభ సభ్యత్వానికి 25వ తేదీన రాజీనామా చేస్తున్నాను అని నిన్ననే తెలిపారు. తాను ఏ రాజకీయపార్టీలోను చేరడంలేదు.. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు.. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్‌కి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకి సదా కృతజ్ఞుడిని అంటూ ట్వీట్‌ రాసుకొచ్చారు. మరోవైపు.. విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై వైసీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందించారు.. విజయసాయి రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి మారీ రాజీనామా చేయొద్దని ఎంపీ గురుమూర్తి కోరారు.