NTV Telugu Site icon

Onion Price: 512 కిలోల ఉల్లి అమ్మితే.. ఖర్చులన్నీ తీసేసి రూ.2లకు చెక్కు ఇచ్చిన వ్యాపారి

Onion

Onion

Onion Price: ఆరుగాలం కష్టపడిన రైతు దారుణంగా దగా పడుతున్నాడు. 512 కిలోల ఉల్లిని విక్రయించిన రైతుకు వ్యాపారి కేవలం రెండు రూపాయల చెక్కు మాత్రమే ఇచ్చాడు. డబ్బులు కావాలంటే మరో 15రోజులు ఆగాల్సిందే అని రైతుకు వ్యాపారి చెప్పడం స్థానికంగా ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ ఘటన షోలాపూర్‌లో జరిగింది. స్వాభిమాని షెట్కారీ సంఘం అధ్యక్షుడు రాజు శెట్టి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వ్యాపారి రైతుకు కేవలం రెండు రూపాయల చెక్కు ఇచ్చి.. డబ్బులు 15 రోజుల తర్వాత ఇస్తానని చెప్పడంపై రాజు శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన పట్ల పాలకులు కాస్త సిగ్గుపడాలని రాజుశెట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

రాజేంద్ర తుకారాం చవాన్ అనే రైతు 10 బస్తాల ఉల్లిపాయలను విక్రయించాడు. 500 కిలోల ఉల్లిని విక్రయించగా 512 రూపాయలు వస్తాయని భావించారు. కానీ 509 రూపాయల ఖర్చు తీసివేసి అతనికి రెండు రూపాయలు మాత్రమే వచ్చాయి. ఈ రెండు రూపాయలకు కూడా వ్యాపారి రైతుకు చెక్కు ఇచ్చి.. 15 రోజుల తర్వాత డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పాడు. రైతులపై దారుణమైన అవహేళన సాగుతోందని రాజుశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Taraka Ratna: నా జీవితంలో నువ్వే బెస్ట్… తారకరత్న గురించి అలేఖ్య ఎమోషనల్ పోస్ట్

దీనిపై రాజు శెట్టి ట్వీట్
“గవర్నర్లారా.. కాస్త సిగ్గుపడండి.. మీరు రైతులకు ఎలా బతకాలో చెప్పండి.. ఒకవైపు రైతుల కరెంటు కనెక్షన్‌ కట్‌ చేయడం మూలాన కళ్ల ముందే పంట కోతకు గురవుతోంది. షోలాపూర్ మార్కెట్ కమిటీలో ఉల్లిపాయల బస్తాలు.. విక్రయిస్తే రైతుకు వ్యాపారి రెండు రూపాయల చెక్కు ఇచ్చాడు. అలా ఇవ్వడానికి మీకు సిగ్గు ఎలా అనిపించలేదు. 15 రోజుల్లో ఈ చెక్కు క్లియర్ అవుతుందని ఆ వ్యాపారి రైతుకు చెబుతున్నాడు’ అని రాజుశెట్టి ట్వీట్ చేశారు.

అసలు ఏం జరిగింది?
షోలాపూర్‌కు చెందిన రాజేంద్ర చవాన్ అనే రైతు 512 కిలోల ఉల్లిని వ్యాపారికి విక్రయించాడు. రూపాయి చొప్పున, అతనికి 512 రూపాయలు లభిస్తాయని భావించారు. కానీ రాజు శెట్టి ఆ బిల్లు ఫోటోను పోస్ట్ చేసి అందులో అద్దె, హమాలీ, తోలకం తదితరాలకు రూ.509 కట్ చేసినట్లు రాసి ఉంది. మిగిలిన రూ.2.49 చెల్లించేందుకు వ్యాపారి కేవలం రూ.2 చెక్కును రాజేంద్ర చవాన్‌కు ఇచ్చాడు.

Read Also: Pa Pa: బ్రేకప్ గజల్… స్లో పాయిజన్ లా ఉందే…