Onion Price: 512 కిలోల ఉల్లి అమ్మితే.. ఖర్చులన్నీ తీసేసి రూ.2లకు చెక్కు ఇచ్చిన వ్యాపారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Onion Price: ఆరుగాలం కష్టపడిన రైతు దారుణంగా దగా పడుతున్నాడు. 512 కిలోల ఉల్లిని విక్రయించిన రైతుకు వ్యాపారి కేవలం రెండు రూపాయల చెక్కు మాత్రమే ఇచ్చాడు. డబ్బులు కావాలంటే మరో 15రోజులు ఆగాల్సిందే అని రైతుకు వ్యాపారి చెప్పడం స్థానికంగా ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ ఘటన షోలాపూర్‌లో జరిగింది. స్వాభిమాని షెట్కారీ సంఘం అధ్యక్షుడు రాజు శెట్టి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వ్యాపారి రైతుకు కేవలం రెండు రూపాయల చెక్కు ఇచ్చి.. డబ్బులు 15 రోజుల తర్వాత ఇస్తానని చెప్పడంపై రాజు శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన పట్ల పాలకులు కాస్త సిగ్గుపడాలని రాజుశెట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
రాజేంద్ర తుకారాం చవాన్ అనే రైతు 10 బస్తాల ఉల్లిపాయలను విక్రయించాడు. 500 కిలోల ఉల్లిని విక్రయించగా 512 రూపాయలు వస్తాయని భావించారు. కానీ 509 రూపాయల ఖర్చు తీసివేసి అతనికి రెండు రూపాయలు మాత్రమే వచ్చాయి. ఈ రెండు రూపాయలకు కూడా వ్యాపారి రైతుకు చెక్కు ఇచ్చి.. 15 రోజుల తర్వాత డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పాడు. రైతులపై దారుణమైన అవహేళన సాగుతోందని రాజుశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
Read Also: Taraka Ratna: నా జీవితంలో నువ్వే బెస్ట్… తారకరత్న గురించి అలేఖ్య ఎమోషనల్ పోస్ట్
దీనిపై రాజు శెట్టి ట్వీట్
“గవర్నర్లారా.. కాస్త సిగ్గుపడండి.. మీరు రైతులకు ఎలా బతకాలో చెప్పండి.. ఒకవైపు రైతుల కరెంటు కనెక్షన్ కట్ చేయడం మూలాన కళ్ల ముందే పంట కోతకు గురవుతోంది. షోలాపూర్ మార్కెట్ కమిటీలో ఉల్లిపాయల బస్తాలు.. విక్రయిస్తే రైతుకు వ్యాపారి రెండు రూపాయల చెక్కు ఇచ్చాడు. అలా ఇవ్వడానికి మీకు సిగ్గు ఎలా అనిపించలేదు. 15 రోజుల్లో ఈ చెక్కు క్లియర్ అవుతుందని ఆ వ్యాపారి రైతుకు చెబుతున్నాడు’ అని రాజుశెట్టి ట్వీట్ చేశారు.
అసలు ఏం జరిగింది?
షోలాపూర్‌కు చెందిన రాజేంద్ర చవాన్ అనే రైతు 512 కిలోల ఉల్లిని వ్యాపారికి విక్రయించాడు. రూపాయి చొప్పున, అతనికి 512 రూపాయలు లభిస్తాయని భావించారు. కానీ రాజు శెట్టి ఆ బిల్లు ఫోటోను పోస్ట్ చేసి అందులో అద్దె, హమాలీ, తోలకం తదితరాలకు రూ.509 కట్ చేసినట్లు రాసి ఉంది. మిగిలిన రూ.2.49 చెల్లించేందుకు వ్యాపారి కేవలం రూ.2 చెక్కును రాజేంద్ర చవాన్‌కు ఇచ్చాడు.
Read Also: Pa Pa: బ్రేకప్ గజల్… స్లో పాయిజన్ లా ఉందే…
राज्यकर्त्यांनो जरा तरी लाज बाळगा, शेतक-यांनी जगायचं कसं हे आता तुम्हीच सांगा? एका बाजूला थकबाकी पोटी शेतक-यांची वीज कनेक्शन धडाधड तोडता आणि डोळ्या समोर पीक करपून जातं. राजेंद्र तुकाराम चव्हाण यांनी सोलापूर बाजार समितीमध्ये १० पोती कांदे विकल्यावर त्याला किती पैसे आले,
— Raju Shetti (@rajushetti) February 22, 2023
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!