NTV Telugu Site icon

Gujarat: గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 22 మంది సజీవదహనం

22

22

గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 22 మంది సజీవదహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంపై కేంద్రం పెద్దలు విచారం వ్యక్తం చేశారు. గేమింగ్ జోన్‌లో తక్షణమే రెస్కూ, రిలీఫ్ కార్యకలాపాలు నిర్వహించాలని నగర పాలక సంస్థకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆదేశించారు.

శనివారం సాయంత్రం గేమింగ్ జోన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చిన్నారులు సహా 22 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఇక మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. గేమింగ్ జోన్‌లోని తాత్కాలిక నిర్మాణంలో ఈ ప్రమాదం సంభవించింది. వేసవి సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో చిన్నారులు తరలివచ్చారు.

గేమింగ్ జోన్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అగ్నిప్రమాదానికి సంబంధించిన భయంకరమైన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం 60 గేమింగ్ జోన్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 20 మందిని రక్షించారు. మంటలకు కారణాలేంటో ఇంకా తెలియలేదు. గేమింగ్ జోన్ పూర్తిగా చెక్‌తో నిర్మించడం వల్ల ప్రమాదం తీవ్రంగా జరిగింది. ఇక బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారి ఆచూకీ కోసం తెలియక హడలిపోతున్నారు. ఫోన్లు చేసుకుంటూ సమాచారాలు తెలుసుకుంటున్నారు. సంఘటనాస్థలికి పోలీసులు, అధికారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించింది.