NTV Telugu Site icon

Rajiv Gandhi Case: 3 దశాబ్దాల తర్వాత నిందితులకు వీడ్కోలు

Rajivi

Rajivi

దాదాపు 30 ఏళ్ల తర్వాత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ నిందితులకు భారత్ నుంచి విముక్తి లభించింది. బుధవారం నిందితులు తమ స్వదేశానికి బయల్దేరి వెళ్లారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలి, జీవిత ఖైదు అనుభవించిన ముగ్గురు వ్యక్తులు బుధవారం ఉదయం శ్రీలంకకు వెళ్లారు. రాజీవ్‌గాంధీ 1991, మే 21న మానవ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబదూర్‌లో రాజీవ్ గాంధీ మరణించారు.

ఇది కూడా చదవండి: Kinnera Mogilaiah: సీఎం రేవంత్‌పై మొగిలయ్య పాట..

అయితే ఈ హత్య కేసులో దోషులైన మురుగన్, రాబర్ట్ పయస్, జయకుమార్ సహా మొత్తం ఆరుగురు దోషులను సుప్రీంకోర్టు సూచనల మేరకు 2022 నవంబర్‌లో విడుదల చేశారు. వీరు జైల్లో సత్ర్పవర్తనతో మెలగడంతో శిక్షా కాలాన్ని తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసింది. వారు శ్రీలంక జాతీయులు కావడంతో జైలు నుంచి విడుదలైన అనంతరం తిరుచురాపల్లిలోని శరణార్థి శిబిరానికి తరలించారు. ఇటీవల శ్రీలంక ప్రభుత్వం ఈ ముగ్గురికి పాస్‌పోర్ట్‌లు మంజూరు చేయడంతో బుధవారం ఉదయం పోలీసుల బృందం వారిని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. ముగ్గురు కూడా శ్రీలంకకు చేరుకున్నారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత భారత్ నుంచి వారికి విముక్తి లభించింది.

ఇది కూడా చదవండి: Film Chamber: హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో అగ్నిప్రమాదం

నిందితుల్లో ఒకరైన భారతీయ పౌరురాలు నళినిని మురుగన్‌ వివాహం చేసుకున్నారు. ఆమెకు మరణశిక్ష విధించినప్పుడు నళిని గర్భిణి అని తేలడంతో సోనియాగాంధీ ఆమె మరణశిక్షను రద్దు చేశారు. ప్రస్తుతం ఆమె కుమార్తె యూఎస్‌లో వైద్యురాలుగా ఉన్నారు. నళిని తన కుమార్తె దగ్గరకు వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నిస్తోంది. ఆమె భర్త కొలంబో వెళ్లిన అనంతరం అక్కడి నుంచి వీసా తీసుకొని కూతురి దగ్గరకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: RC 16: మెగాస్టార్ ని కూడా దింపుతున్నావా? అసలు ఏం ప్లాన్ చేశావ్ బుచ్చి?