Lal Salaam : రజనీకాంత్ లాల్ సలామ్ మూవీ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది జైలర్ మూవీ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. నెల్సన్ దర్శకత్వం లో తెరకెక్కిన జైలర్ మూవీ రజనీకాంత్ కెరీర్ లోనే భారీగా కలెక్షన్స్ సాధించి తలైవా పవర్ ఫుల్ కమ్ బ్యాక్ మూవీ గా నిలిచింది.జైలర్ మూవీ ఇచ్చిన జోష్ లో తలైవా ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీగా వున్నాడు..ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న సినిమాలలో లాల్ సలామ్ మూవీ ఒకటి..ఈ సినిమాను ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రం లో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్ నెట్టింట బాగా ట్రెండింగ్ అవుతోంది. లాల్ సలామ్ చిత్ర యూనిట్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను షురూ చేసింది. తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై అప్‌డేట్ ను అందించింది.
లాల్ సలామ్ ఫస్ట్ సింగిల్ ను నేడు సాయంత్రం 5 గంటలకు లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ చిత్ర యూనిట్ సాంగ్ లుక్ ను కూడా విడుదల చేసింది. చిత్ర యూనిట్ ఇచ్చిన అప్‌డేట్ ప్రకారం ఫస్ట్ సింగిల్ “THER THIRUVIZHA” సాంగ్ ను లాంఛ్ చేసింది. సంప్రదాయ ఫ్లేవర్‌లో సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేస్తోంది.వివేక్ రాసిన ఈ పాటను ఏఆర్ రెహమాన్ కంపోజిషన్‌లో శంకర్ మహదేవన్, ఏఆర్ రెహానా మరియు దీప్తి సురేశ్ యోగి శంకర్ పాడారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరణ్ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.. ‘3’ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రజినీకాంత్. ఆ తర్వాత ‘వాయ్ రాజా వాయ్’ మరియు ‘సినిమా వీరన్’ సినిమాలు తెరకెక్కించింది. చాలా రోజుల తర్వాత తండ్రీకూతుళ్ల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం తో లాల్ సలామ్ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.రజినీకాంత్ మరోవైపు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం లో తలైవా 170 సినిమాను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.. అలాగే దీంతోపాటు రజనీకాంత్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తలైవా 171లో కూడా నటిస్తున్నారు.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!