Site icon NTV Telugu

Rajinikanth: పేరుకే సూపర్ స్టార్.. కానీ ఇంత సింప్లిసిటీ ఏంటయ్యా? రోడ్డు పక్కన భోజనం చేస్తూ..

Rajani Kanth

Rajani Kanth

Rajinikanth: ‘కూలీ’ (Coolie) చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటనకు తాత్కాలిక విరామం ప్రకటించి ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు. తాజాగా రజనీకాంత్ తన స్నేహితులతో కలిసి హిమాలయాల పర్యటనకు బయలుదేరారు. ఈ యాత్రలో భాగంగా ఆయన సామాన్య జీవితాన్ని ఆస్వాదిస్తున్న పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం (అక్టోబర్ 6) ఉదయం ఆయన శ్రీ బద్రీనాథ్ ధామ్‌ను దర్శించుకున్నారు.

ChatGPT: ఈ విషయాలపై ChatGPT ని సలహా అడుగుతున్నారా?.. చిక్కుల్లో పడ్డట్టే!
శ్రీ బద్రీనాథ్ ధామ్‌కు చేరుకున్న రజనీకాంత్, అక్కడ బద్రీవిశాల్ స్వామిని దర్శించుకున్నారు. శ్రీ బద్రీనాథ్ కేదార్‌నాథ్ దేవస్థానం కమిటీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, పవిత్ర ప్రసాదాన్ని అందించింది. రజనీకాంత్ ప్రతి సంవత్సరం ఉత్తరాఖండ్‌లోని పుణ్యక్షేత్రాలను సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది.

బద్రీనాథ్ కంటే ముందు, రజనీకాంత్ రిషికేశ్‌లో సాధారణ జీవితాన్ని గడుపుతున్న మరికొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు పేరుకే సూపర్ స్టార్.. కానీ ఇంత సింప్లిసిటీగా ఉంటారని పోస్ట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలలో సూపర్‌స్టార్ తన స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన నిలబడి ప్లేట్‌లో సాధారణ ఆహారాన్ని తింటూ కనిపించారు.

Shocking Video: మరీ ఇలా తయారయ్యారేంటమ్మా.. అత్తపై కోడలు దాడి

ఈ అత్యంత నిరాడంబరమైన విషయాన్నీ చూసి అభిమానులు రజనీకాంత్ సింప్లిసిటీని ఆకాశానికి ఎత్తేశారు. ఈ పర్యటనలో రజనీకాంత్ చాలా సాధారణమైన దుస్తుల్లో కనిపించారు. ఆయన తెల్లటి ధోతీ, కుర్తా ధరించి, మెడలో స్కార్ఫ్‌ వేసుకున్నారు. సూపర్‌స్టార్ ఈ నిరాడంబర శైలిని చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

Exit mobile version