Site icon NTV Telugu

Rajinikanth: హిమాలయాల్లో రజినీకాంత్..

rajinikanth

rajinikanth

తమిళ్ స్టార్ హీరో రజినీకాంత్ సినిమాలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది.. ఇక్కడ కూడా ఆయనకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు.. అయితే ఈ వయస్సులో కూడా రజినీ తగ్గట్లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. తాజాగా ఆయన నటించిన జైలర్ సినిమా విడుదలైంది..ప్రీ బుకింగ్స్ విషయంలో ఎన్నో రికార్డులను బద్దలుకొట్టింది ఈ చిత్రం. అమెరికాలో అయితే ఇప్పటివరకు ఏ చిత్రం సాధించని ప్రీ బుకింగ్స్ను సొంతం చేసుకుంది ‘జైలర్’. మంచి టాక్ ను అందుకుంది.. ఈ సినిమా మేనియా కొనసాగుతుంది.. కొన్ని రాష్ట్రాల్లో సినిమా కోసం సెలవులు కూడా ప్రకటించారు అంటే రజినీకాంత్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు..

ఇకపోతే రజినీకాంత్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అదేంటంటే జైలర్ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు వెయిట్ చేస్తుంటే రజినీకాంత్ మాత్రం హిమాలయాలకు వెళ్లారు.. తనకు సమయం దొరికినప్పుడల్లా ఇలా హిమాలయాలకు వెళ్లిపోవడం సూపర్ స్టార్కు అలవాటే. అన్నింటికంటే మనశ్శాంతికి ఉండడం ముఖ్యం అని నమ్మే నటుడు రజినీకాంత్. అందుకే తనకు సమయం కుదిరినప్పుడల్లా హిమాలయాలకు వెళ్లడం, అక్కడ ధ్యానం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎక్కువశాతం ఈ హడావిడికి దూరంగా అక్కడికి వెళ్లి ఉండాలనుకుంటారు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రతీ ఏడాది హిమాలయాలకు వెళ్లే రజినీకాంత్..

ఆ మధ్య కరోనా పరిస్థితి వల్ల గత నాలుగేళ్ల నుంచి వెళ్లడం కుదరలేదు. అందుకే ‘జైలర్’ రిలీజ్ ఉన్నా సరే ఈ ఏడాది చాలా గ్యాప్ తర్వాత హిమాలయాలకు వెళ్లిపోయారు రజినీ.. అక్కడ నది వద్ద తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటో ఒక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రకృతి ఒడిలో, ధ్యానంలో నిమగ్నం అవుతారు.. కొద్ది రోజులు ఇక్కడే ఉండి మళ్లీ వెళతారు.. ఇక జైలర్ సినిమా ఇప్పటివరకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

Exit mobile version