Site icon NTV Telugu

Pic Talk : స్టైలిష్ లుక్ లో రజినీకాంత్..!

Rajinikanth New Look

Rajinikanth New Look

తమిళ తలైవా ప్రముఖ తమిళ నటుడు రజనీకాంత్‌ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తెలుగులో కూడా రజినీకాంత్ కు మంచిది మార్కెట్ ఉంది.. తెలుగులో కూడా ఫాలోయింగ్ ఎక్కువే.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు.. అందుకే తమిళ్ తంబీలు ఆయనకు వీరాభిమానులుగా మారారు.. ఆయన సినిమా అంటే రచ్చ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి హంగామా మాములుగా ఉండదు.. అయితే తాజాగా రజినీకాంత్ ఎయిర్ పోర్ట్ లో స్టైలిష్ లుక్ లో కనిపించాడు.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

బిజీ లైఫ్ కు కాస్త విరామం ఇచ్చారు. రీఫ్రెష్‌ అయ్యేందుకు ఆయన మాల్దీవులకు వెళ్లనున్నారు.. తమ ఫ్లైట్‌లో రజనీకాంత్‌ ప్రయాణించడంపై శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. చెన్నై నుంచి మాల్దీవుల రాజధాని మాలె వరకు రజనీ ప్రయాణం కొనసాగిందని తెలిపింది. సంబంధిత ఫొటోలను పంచుకుంది. వాటిల్లోని ఓ ఫొటోలో రజనీకాంత్‌ బ్యాగ్‌ పట్టుకుని, కళ్లజోడు పెట్టుకుని స్టైలిష్‌గా ఉన్నారు. మరో ఫొటోలో ఎయిర్‌హోస్టెస్‌ ఇచ్చిన ఫ్లవర్‌ బొకేతో నవ్వుతూ కనిపించారు. రజనీకాంత్‌ ఒక్కరే హాలీడే ట్రిప్‌నకు వెళ్తున్నట్టు తెలుస్తోంది..

ఈ మధ్య లాల్‌ సలామ్‌’ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకున్నారు రజనీకాంత్‌. ఆయన కుమార్తె ఐశ్వర్య తెరకెక్కిస్తున్న చిత్రమిది. విష్ణు విశాల్‌ హీరోగా నటించగా రజనీకాంత్‌.. మొయిద్దీన్‌ భాయ్‌ అనే కీలకపాత్రలో రజినీకాంత్ కనిపించనున్నారు. మరోవైపు, రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కిస్తున్న ‘జైలర్‌’ చిత్రీకరణ పూర్తయింది. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాలో మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ, జాకీ ష్రాఫ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.. దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ తో రజనీకాంత్‌ ఓ సినిమాని ఖరారు చేసిన సంగతి తెలిసిందే.. ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Exit mobile version