Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..

Tridhs, Ksmsl Hsddon, Tsjini Ksmth

Tridhs, Ksmsl Hsddon, Tsjini Ksmth

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇద్దరు దిగ్గజాలు తమదైన స్టైల్, స్వాగ్‌తో కనిపించడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఫిలిం సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘96’ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న త్రిష ప్రస్తుతం వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రజనీ-కమల్ కాంబోపై ఉన్న క్రేజ్‌కు, ఇప్పుడు త్రిష పేరు కూడా జోడవడంతో హైప్ మరింత పెరిగింది. అయితే ఆమె ఏ హీరో సరసన నటిస్తారు? పాత్ర ఎలా ఉండబోతుంది? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ కథలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఇక ఈ చిత్రానికి అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.