Rajini – Kamal Multistarrer: రజినీ, కమల్ మల్టీస్టారర్ ఉన్నట్టా ? లేనట్టా?

Rajini Kamal

Rajini Kamal

Rajini – Kamal Multistarrer: కోలీవుడ్ ఇద్దరు దిగ్గజ నటులు సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ మల్టీస్టారర్ సినిమాపై గత కొద్దిరోజులుగా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్ అన్నింటికీ ఓ ప్రముఖ తమిళ డిస్ట్రిబ్యూటర్ ఫుల్‌స్టాప్ పెట్టారు.

ఈ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ 100 శాతం పట్టాలెక్కుతుందని సదరు డిస్ట్రిబ్యూటర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’, కమల్ హాసన్ చేస్తున్న ‘సండియార్’ సినిమాల షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రెండు చిత్రాల షూటింగ్‌లు ముగిసిన వెంటనే ఈ క్రేజీ మల్టీస్టారర్ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.

‘జైలర్’ ఫేమ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ సినిమాను 2028 సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ పక్కా ప్లాన్‌తో సన్నాహాలు చేస్తున్నారు. ఈ అధికారిక అప్డేట్ తో కోలీవుడ్ సినీ ప్రియులు, ఇరువురు హీరోల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫస్ట్ రూ. 1,000 కోట్ల గ్రాసర్ సినిమా ఇదే అవుతుందని ట్రేడ్ వర్గాలు, అభిమానులు భారీ అంచనాలు వేస్తున్నారు. అయితే, ఇంతటి భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కించేటప్పుడు ఎలాంటి తొందరపాటు వద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు. పకడ్బందీ స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం దర్శకుడు నెల్సన్‌కు తగినంత సమయం ఇవ్వాలని వారు నిర్మాతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి!