Site icon NTV Telugu

Coolie : “కూలీ”కోసం రజనీ భారీ రెమ్యూనరేషన్..ఎన్ని కోట్లంటే..?

Coolie

Coolie

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా వున్నారు.జైలర్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన తలైవా ఆ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం తలైవా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కూలీ”.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.రజనీకాంత్ 171వ చిత్రంగా “కూలీ” సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తోంది. ఇందులో చాలా కాలం తరువాత నటి శోభన రజనీకాంత్‌ సరసన నటించబోతున్నట్లు సమాచారం.అలాగే స్టార్ హీరోయిన్ శృతిహాసన్ మరియు బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్వీర్ సింగ్ ఈచిత్రంలో కీలక పాత్రలలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర టైటిల్‌తో పాటు టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కూలీ టీజర్‌ లో బంగారంతో డిజైన్‌ చేసిన ఆయుధాలు, వాచ్‌ మరియు చైన్లతో రజినీ స్టైలిష్ లుక్ అండ్ ఫైట్ అదిరిపోయింది. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం తమ అంచనాలకు తగ్గట్టుగా ఈ టీజర్ లేదనే కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారని సమాచారం. విక్రమ్, లియో రేంజ్‌లో కూలీ టైటిల్ టీజర్ లేదని వారు కామెంట్ చేటున్నారు. ”కూలీ”చిత్రం గోల్డ్‌ స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే కథ అని, ఇందులో రజనీకాంత్‌ మరోసారి స్మగ్లర్‌గా నటిస్తున్నారని తెలుస్తుంది.ఈ చిత్రం కోసం రజనీకాంత్‌ ఏకంగా రూ. 260 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు, అలాగే దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ రూ.60 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోంది.

Exit mobile version