Rajinikanth: తమిళనాడు ప్రభుత్వం శనివారం ఇళయరాజా సంగీత ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. ఇంతకీ సూపర్ స్టార్ ఏం మాట్లాడారంటే..
READ ALSO: Tomato: టమోటా రేటులో భారీ పతనం.. కిలో రూ. 2 కూడా పలకని ధర..!
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంల మధ్య స్నేహబంధాన్ని రజనీకాంత్ ఈ వేదికపై గుర్తుచేశారు. ఎస్పీబీ మరణం ఇళయరాజాను ఎంతగానో కలచివేసిందని అన్నారు. ఇళయరాజా తన సోదరుడు, భార్య, కుమార్తె చనిపోయినా కంటతడి పెట్టుకోకుండా ధైర్యంగా ఉన్నారని, కానీ ఎస్పీబీ మరణాన్ని మాత్రం తట్టుకోలేకపోయారని గుర్తుచేశారు. ఆ సమయంలో ఇళయరాజా భావోద్వేగంతో ఏడ్చేశారని చెప్పారు. అనంతరం ఇళయరాజాతో తనకున్న అనుబంధాన్నీ సూపర్ స్టార్ గుర్తుచేసుకున్నారు. తాను హీరోగా
నటించిన ‘జానీ’ సమయంలో వారి మధ్య జరిగిన సరదా సంభాషణలను పంచుకున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ఇళయరాజా లేకుండా జోల పాటలు, యువతకు ప్రేమగీతాలు లేవన్నారు. తానెప్పుడూ ఇళయరాజాకు పీఆర్వోనే అంటూ కమల్‌హసన్ అన్నారు. కార్యక్రమంలో సీఎం స్టాలిన్, పలువురు ప్రముఖ నటులు, తదితరు పాల్గొన్నారు.
READ ALSO: Nepal: నేపాల్‌లో మళ్లీ నిరసనలు.. పక్క దేశంలో అసలు ఏం జరుగుతోంది
