ఒక సాధారణ బస్సు కండక్టర్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది.. సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ సినీ ప్రస్థానం అసాధారణం. కోట్ల మంది అభిమానులు ఆరాధించే రజనీకాంత్ జీవిత కథ (బయోపిక్) ఎప్పుడు వెండితెరపైకి వస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై రజనీ కుమార్తె ఐశ్వర్య క్లారిటీ ఇచ్చి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపారు. తన తండ్రి ఆటోబయోగ్రఫీకి సంబంధించిన చిత్ర పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆమె అధికారికంగా వెల్లడించారు.
Also Read : Tarun Bhascker : వారిని శాటిస్‌ఫై చేసే టాలెంట్ నాకు లేదు..
ఈ సినిమా విడుదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా ఒక సెన్సేషన్ సృష్టిస్తుందని ఐశ్వర్య ధీమా వ్యక్తం చేశారు. మారుతున్న టెక్నాలజీని వాడుకుంటూ అద్భుతమైన విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించే యోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనే ‘కోచ్చాడయాన్’ వంటి టెక్నాలజీ ఆధారిత చిత్రాల అనుభవం ఉన్న ఐశ్వర్య, ఈ బయోపిక్ విషయంలో కూడా భారీ ప్లాన్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రజనీ పాత్రను ఎవరు పోషిస్తారు? దర్శకత్వ బాధ్యతలు ఎవరు చేపడతారు? అనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఏది ఏమైనా, తలైవా జీవిత ప్రయాణాన్ని వెండితెరపై చూడబోతున్నామన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
