NTV Telugu Site icon

Rajini Coolie: లోకేషూ ఏమైందయ్యా నీకు..?

Whatsapp Image 2024 04 24 At 7.56.59 Am

Whatsapp Image 2024 04 24 At 7.56.59 Am

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లోకేష్ కనగరాజ్ సినిమాలు విభిన్నంగా వుంటూ ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించేలా ఉంటాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌గా చేసిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి.తాజాగా లోకేష్ కనగరాజ్ తన అభిమాన హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఓ పవర్ ఫుల్ మూవీని తెరకెక్కిస్తున్నారు.సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం ”తలైవార్ 171 ” వర్కింగ్ టైటిల్ తో మొదలైంది .తాజాగా ఈ చిత్రానికి సంబంధించి పవర్ ప్యాక్డ్ టీజర్ ద్వారా టైటిల్ రివీల్ చేసారు..ఈ చిత్రానికి ”కూలీ” అనే టైటిల్ ను అనౌన్స్ చేసారు.రజనీకాంత్ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్‌తో లోకేష్ ఆశించినంత రేంజ్‌ హైప్ క్రియేట్ చేయలేకపోయాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అసలు తలైవార్ 171 మూవీ అనౌన్స్ అయినప్పుడు ఫ్యాన్స్ లో ఈ మూవీపై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి.

రజనీకాంత్ కు డై హార్డ్ ఫ్యాన్‌ అయినా లోకేష్ తలైవా ను ఎలా చూపిస్తాడో అని ఫ్యాన్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుకున్నారు .. పైగా ఈ సినిమాలో రజనీ కాంత్ నెగెటివ్ రోల్ అనే న్యూస్ కూడా బయటికి రావడంతో ఫ్యాన్స్ అంచనాలు పీక్స్ కు చేరాయి..ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా టైటిల్‌ని ‘కూలీ’గా అనౌన్స్ చేస్తూ.. పవర్ ఫుల్ టీజర్ ను లోకేష్ రిలీజ్ చేశాడు .ఇక రజనీ ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ ఇచ్చేలా గోల్డ్‌లా కూలీ టీజర్ మెరిసిపోయింది . బంగారంతో డిజైన్‌ చేసిన ఆయుధాలు, వాచ్‌ మరియు చైన్లతో రజినీ స్టైలిష్ లుక్ అండ్ ఫైట్ అదిరిపోయింది. కానీ కొందరు మాత్రం తమ అంచనాలకు తగ్గట్టుగా ఈ టీజర్ లేదనే కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారని సమాచారం. విక్రమ్, లియో రేంజ్‌లో కూలీ టైటిల్ టీజర్ కట్ చేయలేదని వారు కామెంట్ చేటున్నారు. గోల్డ్ బ్యాక్ డ్రాప్ బాగున్నా కూడా డైలాగులు అలాగే రజినీ యాక్షన్ మార్క్ కనిపించలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా విక్రమ్, లియో టైటిల్ గ్లింప్స్‌ రేంజ్‌లో కూలీ టీజర్ హైప్ క్రియేట్ చేయలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ కొందరు మాత్రం ఇది జస్ట్ టీజర్ మాత్రమే ‘కూలీ’ అసలు కథ ముందు ఉందని కామెంట్స్ చేస్తున్నారు.