New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిహార్‌లోని క్రికెట్ ప్రేమికులకు , క్రీడాకారులకు దశాబ్దాలుగా ఉన్న ఒక గొప్ప కల నెరవేరబోతోంది. బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలోని చారిత్రాత్మక రాజ్‌గిర్ నగరంలో నిర్మిస్తున్న “రాజ్‌గిర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం” పనులు వేగంగా ముగింపు దశకు చేరుకున్నాయి. డిసెంబర్ 2026 నాటికి ఈ స్టేడియాన్ని అన్ని రకాలుగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర క్రీడా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
సుమారు 90 ఎకరాల వైశాల్యంలో, రూ. 633 కోట్ల భారీ అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్రికెట్ స్టేడియం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ స్టేడియంలోని మెయిన్ పెవిలియన్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఏకకాలంలో 40 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్‌లను వీక్షించేలా దీనిని రూపొందిస్తున్నారు. రాత్రి వేళల్లో మ్యాచ్‌ల కోసం అత్యాధునిక ఫ్లడ్‌లైట్లు, హై-టెక్ ఎలక్ట్రానిక్ స్కోర్బోర్డులు, కార్పొరేట్ బాక్స్‌లు, మీడియా సెంటర్, ప్లేయర్ల కోసం విలాసవంతమైన డ్రెస్సింగ్ రూమ్‌లు ఉంటాయి. మ్యాచ్ పిచ్ కోసం నాణ్యమైన ఎర్ర మట్టిని, ప్రాక్టీస్ పిచ్‌ల కోసం నల్ల మట్టిని ఉపయోగిస్తున్నారు. వర్షం పడితే నీరు త్వరగా బయటకు పోయేలా అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
స్థానిక ప్రాతిభకు ప్రపంచ స్థాయి వేదిక..
ఈ స్టేడియం అందుబాటులోకి వస్తే బిహార్‌కి చెందిన ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ, ముకేష్ కుమార్, ఆకాష్ దీప్ వంటి స్టార్ క్రికెటర్లు తమ స్వరాష్ట్రంలోనే జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానిక క్రీడాకారులకు ఇక్కడే అత్యుత్తమ శిక్షణ లభిస్తుంది.
క్రీడా శాఖ మంత్రి శ్రేయసి సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్టేడియం కేవలం ఆటలకే కాకుండా బీహార్ క్రీడా రంగానికి ఒక కొత్త గుర్తింపుగా మారనుంది. రాజ్‌గిర్ కాంప్లెక్స్‌లో క్రికెట్‌తో పాటు హాకీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, షూటింగ్, కబడ్డీ వంటి అనేక ఆటలకు ఇప్పటికే వసతులు కల్పించారు. దీనివల్ల ప్రాంతీయ పర్యాటకం, ఉపాధి అవకాశాలు పెరిగి బీహార్ ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!