Site icon NTV Telugu

Hyderabad: లివ్‌ఇన్ రిలేషన్.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో యువకుడు మృతి..

Bus Died

Bus Died

Hyderabad: డ్రగ్స్ ఓవర్ డోస్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. పాత బస్తీ కాళాపత్తర్ కు చెంది అహ్మద్ కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతి శివరాంపల్లి కెన్ వర్త్ అపార్ట్మెంట్ లో కో రిలేషన్ లో ఉంటున్నారు. రాత్రి డ్రగ్స్ కొనుగోలు చేసి రూమ్ లో సేవించారు. అహ్మద్ మృతి చెందాడు. యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. యువతిని ఆసుపత్రికి తరలించారు. రూమ్ లో నలుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కోల్‌కతాకు చెందిన యువతి, కర్నూల్ కు చెందిన మరో యువతితో పాటు అహ్మద్ అతని స్నేహితుడు ఉంటున్నట్లు తెలిపారు. అహ్మద్ కి డ్రగ్స్ ఓవర్ డోస్ తో రక్త స్రావం అయ్యింది.. బయపడిన స్నేహితుడు 108 కి కాల్ చేసింది. 108 సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసి కోల్‌కతాకు చెందిన పారిపోయింది. యువతిని వెంబడించి పట్టుకున్నారు. ముగ్గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.

READ MORE: Balakrishna : షాకింగ్ : జైలర్ 2 రిజెక్ట్ చేసిన బాలయ్య.. మరో క్రేజీ సినిమా కూడా?

Exit mobile version