Site icon NTV Telugu

Woman Marries Lord Vishnu : మహా విష్ణువును పెళ్లి చేసుకున్న మహిళ

Rajastan Woman

Rajastan Woman

Woman Marries Lord Vishnu : దేవుళ్లను ఆరాధించడం మన సంప్రదాయం. పూర్వం దేవుడి కటాక్షం కోసం చాలామంది కఠినంగా తపస్సులు కూడా చేశారని విన్నాం. ఇప్పటికే దేవుడే తమ లోకంగా భక్తిలో మునిగిపోయే భక్తులున్నారు. మీరా బాయి గుర్తుందా మీకు ఆమె కృష్ణ భ‌గ‌వానుడిపై అమిత‌మైన‌ ప్రేమ పెంచుకున్న ఆమె చివ‌ర‌కు అత‌డిని పెళ్లి చేసుకుంది. అలాగే రాజస్తాన్ లోని ఓ మహిళ దేవుడిపై తనకున్న భక్తిని ప్రేమగా మార్చుకుంది. ఆ ప్రేమతోనే శ్రీ మహా విష్ణువును డిసెంబ‌ర్ 8వ తేదీన సంప్రదాయబద్ధంగా పెళ్లాడింది. ఆమె నిర్ణయం వెన‌క కార‌ణం తెలిసి చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత‌కు ఆమె ఏం చెప్పిందంటే… ‘చిన్న చిన్న విష‌యాల‌కే భార్యాభర్తలు గొడ‌వ‌ప‌డ‌డం చూశాను. గొడ‌వ‌ల కార‌ణంగా వాళ్ల జీవితాలు నాశ‌నం కావ‌డం గ‌మ‌నించాను. అయితే.. ఎక్కువ‌గా న‌ష్టపోయేది మాత్రం ఆడ‌వాళ్లే. అందుక‌నే నేను విష్ణువును పెళ్లి చేసుకోవాల‌నుకున్నా’ అని చెప్పింది. ఆ యువ‌తి పేరు పూజా సింగ్. ఆమెది జైపూర్‌లోని న‌ర్సింఘ్‌పూర్ గ్రామం.

Read Also: Delivery In Washroom : ప్రెగ్నెన్సీ అని తెలియకుండానే బిడ్డకి విమానంలో జన్మనిచ్చిన మహిళ

జైపూర్‌లోని నర్సింగ్‌పురా గ్రామంలో నివసించే పూజా సింగ్‌కి 30 ఏళ్లు. ఆమె తండ్రి BSF నుండి పదవీ విరమణ పొందారు. ఆయనకు తన కూతురు వివాహం చేసుకోవడం ఇష్టంలేదు. తన వివాహానికి కూడా హాజరు కాలేదు. కానీ ఆమె తల్లి రతన్ కన్వర్ దీనికి మద్దతుగా నిలిచి.. కన్యాదానం చేసింది. దాదాపు 300 మంది కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో అధికారిక వివాహ వేడుకలో పూజా సింగ్, మహా విష్ణువు విగ్రహంతో వివాహం జరిగింది. ఇలాంటి పెళ్లికి కుటుంబ సభ్యులను ఒప్పించడం అంత సులువు కాదని, అయితే తాను నిశ్చయించుకున్నానని, చివరికి తన తల్లి మద్దతును పొందానని పూజ తెలిపింది. పండిట్‌తో పూజ తొలుత ఈ రకమైన వివాహం గురించి చర్చించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఇది సాధ్యమవుతుందని తెలపడంతోనే తాను వివాహం చేసుకున్నట్లు ఆమె తెలిపింది. ఇప్పుడు, వివాహం తర్వాత, దాంతో, పూజ ఇంట్లోనే విష్ణువు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రతిరోజు ఆ విగ్రహానికి పూజ‌లు చేస్తూ గ‌డ‌ప‌నుంది.

Exit mobile version