Tragedy: అక్కినేని నాగార్జున నటించిన హలో బ్రదర్ సినిమా చూశారా.. అందులో నాగార్జున డ్యుయెల్ రోల్ పోషించారు. అందులో ఒకరికి ఏమైనా మరో అతడి శరీరంలో రియాక్షన్ వస్తుంటుంది. సరిగా అలాగే జరిగింది ఇక్కడ కాకపోతే అది సినిమా.. కానీ ఇక్కడ విచిత్రంగా కవలలు ఒకే రోజు విచిత్రమైన పరిస్థితుల్లో కొన్ని గంటల వ్యవధిలో చనిపోయారు. రాజస్థాన్‌లోని పర్మార్‌కు చెందిన సుమర్, సోహన్ సింగ్ అనే కవలలు.. 900 కి.మీ.దూరంగా వారిద్దరు వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో సుమేర్ తన ఇంటి టెర్రస్‌పై నుంచి పడి మృతి చెందాడు. జైపూర్‌లోని వాటర్ ట్యాంక్‌లో పడి సోహన్ మృతి చెందాడు. ఇద్దరు సోదరుల మృతదేహాలకు గురువారం (జనవరి 12) వారి స్వగ్రామం చర్నో క థాలాలో అంత్యక్రియలు జరిగాయి.
Read Also: Kishan Reddy: తండ్రిని అడ్డుపెట్టుకుని కేటీఆర్‌లా మంత్రిని కాలేదు.. కష్టపడి పైకి వచ్చాం..
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఫోన్ మాట్లాడుతుండగా సుమర్ జారి పడిపోయాడు. తన సోదరుడి మరణ వార్త విన్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన సోహన్ గురువారం తెల్లవారుజామున వాటర్ ట్యాంక్‌లో పడిపోయాడని బర్మార్ పోలీస్ స్టేషన్ అధికారి సురేంద్ర సింగ్ తెలిపారు. తమ గ్రామానికి చెందిన బోకర్ రామ్, కవలలకు మరో ఇద్దరు తోబుట్టువులు ఉన్నారని తెలిపారు. సుమర్, సోహన్‌ల మధ్య చిన్నప్పటి నుంచి బలమైన బంధం ఉందని తెలిపారు. సుమర్ కు చదువు అబ్బలేదు. అయితే కష్టపడి చదివి.. రాణించాలని సుమర్ సోహన్ కు సలహా ఇచ్చేవాడు. సోహన్‌ని బాగా చదివించి టీచర్ ను చేయాలని, సుమర్ జీవనోపాధి నిమిత్తం సూరత్‌కు వెళ్లినట్లు గ్రామస్థులు చెప్పారు.