రాజస్థాన్‌లో ఈసారి మే నెలలో 62.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత 100 ఏళ్లలో ఇదే నెలలో అత్యధికం అని భారత వాతావరణ శాఖ నిన్న ( గురువారం ) తెలిపింది. రాష్ట్రంలో సాధారణంగా మే నెలలో సగటున 13.6 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. కానీ ఈసారి, అనేక పాశ్చాత్య అవాంతరాల కారణంగా-మధ్యధరా ప్రాంతంలో ఉద్భవించిన వాతావరణ వ్యవస్థలు మరియు వాయువ్య భారతదేశానికి అకాల వర్షపాతం మరియు ఇతర కారణాల వల్ల, మొత్తం 62.4 మిల్లి మీటర్ల వర్షం కురిసింది.
Also Read : Viral news: ఓరి దేవుడో..ఆంటీ ఏం చేస్తివి.. మైకేల్ కే మతిపోతుందిగా..
గత 100 ఏళ్లలో ఈ నెలలో ఇదే అత్యధిక వర్షపాతం అని వాతావరణ శాఖ పేర్కొంది. మే 1917లో రాజస్థాన్‌లో 71.9 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. బికనీర్, జోధ్‌పూర్, అజ్మీర్, జైపూర్, భరత్‌పూర్ డివిజన్‌లలో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షపాతం కార్యకలాపాలు శనివారం మరియు ఆదివారాల్లో పెరుగుతాయి అని తెలిపింది. జూన్ ఐదు మరియు ఆరు వరకు అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 7, 8 తేదీల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read : 2018: కొంచెం ఆగి ఉంటే వండర్స్ జరిగేవి… తప్పు చేసారు
మరో వైపు రుతుపవనాలు ఈ నెల 4న కేరళలో ప్రవేశిస్తాయని వెల్లడించింది. ఇదే సమయంలో ఒక రోజు ముందుగానే ఈ నెల 3వ తేదీన కేరళను తాకవచ్చంటూ మరి కొందరు నిపుణలు విశ్లేషిస్తున్నారు. ఈ నెల 5న ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల అవర్తనం ఏర్పడుతుందని పేర్కొంది. ఆ తరువాత 48 గంటల్లో అప్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 7, 8 తేదీల్లో రాయలసీమలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది.
