Head Master : విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్లే దారి తప్పుతున్నారు. తమ దగ్గరికి విద్యను అభ్యసించడానికి వచ్చిన విద్యార్థులను లైగింకంగా వేధిస్తున్నారు.ఇలాంటి ఘటనలు దేశంలో ప్రతీ రోజు ఏదో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ లో విద్యార్థినిలను అనుచితంగా తాకుతుండడంతో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు హెడ్ మాస్టార్ ను అరెస్ట్ చేసి కటకటాల్లో పడేశారు.
Read Also: Komaki: మార్కెట్లోకి కోమాకి ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మార్చి 10న జోధ్‌పూర్ సమీపంలోని రామ్‌నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయుడు పాఠశాల బాలికలను అనుచితంగా తాకుతున్నాడని, దాని గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరిస్తున్నాడని ఫిర్యాదుదారులు పేర్కొన్నారని కపర్దా పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జమాల్ ఖాన్ తెలిపారు.
Read Also: SBI: కస్టమర్లకు షాకిచ్చిన ఎస్బీఐ.. నేటి నుంచే అమల్లోకి..
నిందితుడు భగవాన్ సింగ్ రాజ్‌పుత్ (56)పై పోలీసు కేసు నమోదు చేసిన రాష్ట్ర విద్యాశాఖ శనివారం సస్పెండ్ చేసింది. మేజిస్ట్రేట్ ముందు అతని నలుగురి బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసిన తర్వాత అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజ్‌పుత్‌పై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టంతో పాటు భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
