Site icon NTV Telugu

RR Vs LSG: నేడు లక్నోతో రాజస్థాన్ రాయల్స్ పోరు.. పిచ్ రిపోర్ట్ ఇదే

Pant

Pant

IPL-2025లో మొదటి సూపర్ ఓవర్ ఆడిన రాజస్థాన్ రాయల్స్ నేడు లక్నో సూపర్‌జెయింట్స్‌తో తలపడనున్నది. రాజస్థాన్ ఈ మ్యాచ్‌ను తన సొంత మైదానం జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలవడం రాజస్థాన్ కు ముఖ్యం. లేకుంటే ప్లేఆఫ్స్ రేసు చాలా కష్టమవుతుంది. ఏడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఐదు ఓటములతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.

Also Read:Hyderabad: గాలులు బీభత్సం.. బిల్డింగ్ పై నుంచి కూలీన భారీ క్రేన్.. పలు వాహనాలు ధ్వంసం

జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం పిచ్‌ను పరిశీలిస్తే.. బ్యాట్స్‌మెన్‌లకు అలాగే బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే, ఈ పిచ్ స్లోగా ఉంటుంది. భారీ స్కోర్లకు అవకాశం తక్కువ. కానీ బ్యాట్స్‌మన్ ఇక్కడ కొంత సమయం గడిపితే, సులభంగా పరుగులు సాధించొచ్చు. ఏదేమైనా, బ్యాట్స్‌మెన్‌పై బౌలర్లకు స్వల్ప ఆధిక్యం ఉంటుంది. తొలి ఓవర్లలో బంతి బ్యాట్‌పైకి చక్కగా వస్తుంది, కానీ తర్వాత పిచ్ నెమ్మదిస్తుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఒకే ఒక మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి 175 పరుగులు చేసి వారిని ఓడించింది.

Also Read:Building Collapses: ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి

ఈ గ్రౌండ్ లో టాస్ చాలా ముఖ్యం. మంచు కురిసే అవకాశం ఉంటే, టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేయడానికి మొగ్గుచూపుతుంది. తద్వారా ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసి, ఆపై లక్ష్యాన్ని సులభంగా ఛేదించవచ్చు. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్‌లపై దృష్టి సారిస్తుంది. బౌలింగ్ లో రాజస్థాన్ కు చెందిన సందీప్ శర్మ ఈ పిచ్ పై అద్భుతాలు చేసే ఛాన్స్ ఉంది. లక్నో విషయానికొస్తే, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, మిచెల్ మార్ష్, ఐడెన్ మార్ క్రమ్ మెరుపు బ్యాటింగ్ కు ఛాన్స్ ఉంది. బౌలింగ్‌లో దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్ అద్భుతాలు సృష్టించొచ్చు.

Exit mobile version