Site icon NTV Telugu

IPL 2025: ఫిక్సింగ్ ఆరోపణలపై స్పందించిన రాజస్థాన్ రాయల్స్ టీమ్..

Rr

Rr

ఐపీఎల్ రసవత్తరంగా సాగుతున్న వేల ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఫిక్సింగ్ కి పాల్పడిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపణలు చేశాడు. జైపూర్‌లో ఈనెల 19న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఫిక్సింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయారని జైదీప్ ఆరోపణలు చేశాడు. హోమ్ గ్రౌండ్‌లో గెలుపు ఖాయం అనుకున్న సమయంలో ఓడిపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోందని జైదీప్ వెల్లడించాడు. ఆ మ్యాచ్‌పై వెంటనే దర్యాప్తు చేయాలని జైదీప్ బిహానీ కోరాడు.

Also Read:Sunitha: ప్రవస్తిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశా.. మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది!

జైదీప్ బిహానీ ఫిక్సింగ్ ఆరోపణలపై రాజస్థాన్ రాయల్స్ టీమ్ స్పందించింది. లేనిపోని ఆరోపణలు చేస్తున్న జైదీప్ పై చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ ప్రభుత్వానికి RR మేనేజ్మెంట్ లేఖ రాసింది. రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్ కి లేఖ రాసింది. ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచ్ లు ఆడగా రెండింటిలో మాత్రమే గెలిచింది. 6 మ్యాచుల్లో ఓడిపోయింది.

Exit mobile version