Sunitha: ప్రవస్తిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశా.. మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాడుతా తీయగా షో గురించి ఆ షోకు జడ్జిలుగా వ్యవహరిస్తున్న కీరవాణి, సింగర్ సునీత, లిరిక్ రైటర్ చంద్రబోస్‌ల గురించి ప్రవస్తి అనే ఒక కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశం మీద సునీత స్పందించింది. ఈ మేరకు 14 నిమిషాల 33 సెకండ్లు ఉన్న ఒక వీడియోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. రకరకాల చానల్స్‌లో రకరకాల వార్తలు ప్రచురించారు. ఆ అమ్మాయి అనేక యూట్యూబ్ ఛానల్స్‌కి వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చింది. న్యూస్ చానల్స్ చెబుతున్న దాని ప్రకారం ఆమె ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది. నేరుగా సునీత అని మాట్లాడింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ప్రవస్తి, చిన్నప్పటినుంచి నిన్ను బాలు గారు, జానకి గారు, చిత్రమ్మ అందరూ ఒడిలో పెట్టుకున్నట్టే నేను కూడా నీను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశాను. ఇప్పుడు నీకు 19 ఏళ్లు కదా, అలా కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగోదు కదా. చిన్నప్పుడు చాలా బాగా పాడావు అనేదానికంటే చాలా ముద్దుగా పాడావు అని అనేవారు. నీకు గుర్తుందో లేదో.
Operation Karriguttalu : ఆపరేషన్ కర్రిగుట్టలు.. అసలు ఏం జరుగుతోంది..?
Also Read
ముద్దుగా ఉండే దానివి, ముద్దుగా పాడే దానివి, చాలా బాగా పాడే దానివి. చిన్నప్పుడు పాడినట్లు 19 ఏళ్ల వయసులో కూడా పాడి ఉంటే సంతోషించే వాళ్లలో మొట్టమొదటి వ్యక్తిని నేనే అవుతాను. ఎందుకంటే మా ప్రవస్తి అని మేమే ఎక్కువగా చెప్పుకొని మురిసిపోయే పిచ్చి వాళ్లం మేము. ఎందుకంటే ఎవరు బాగా పాడితే ఆ పాటలో కరిగిపోయి కన్నీళ్లు పర్యంతం అయిపోయి ఏడ్చేసిన సందర్భాల్లో చాలా ఉన్నాయి. అవి నువ్వు చూడలేదేమో, మిస్సయ్యావేమో. అలాంటి పరిస్థితి ఈ రోజు ఇంత పెద్దదైపోయి రోడ్డు మీదకు వెళ్లి ఎంతమందితో మాట్లాడి తన బాధలు వెళ్లగక్కొని మమ్మల్ని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది అంటే నాకు కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది. అంటూ ఆమె సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ వీడియో ఇప్పుడు మీకోసం.
తాజావార్తలు
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!