NTV Telugu Site icon

Bullet Temple: బుల్లెట్ బండిని పూజించే గుడి.. ఎక్కడో తెలుసా?

New Project (9)

New Project (9)

Bullet Temple: భారతదేశం సంప్రదాయాలకు పుట్టినిల్లు అన్న సంగతి తెలిసిందే. ఎవరి నమ్మకాల ప్రకారం భిన్న రకాలుగా దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తారు. వాహనాల విషయంలో కూడా ప్రజలకు భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి. కొంతమంది కొత్త కారు లేదా మోటారు సైకిల్ కొన్నప్పుడు ముందుగా గుడికి వెళ్తారు. చాలా మంది తమ కార్ల డ్యాష్‌బోర్డ్‌పై దేవుళ్ల చిత్రాలను ప్రింట్ చేయించుకుంటారు. కొందరు తమ బైక్‌లపై రకరకాల ఆధ్యాత్మిక దండలు వేస్తారు. ఎందుకంటే డ్రైవింగ్ అనేది రిస్క్ తో కూడుకున్న పని. మీరు మీ దైనందిన జీవితంలో ఇలాంటివి ఎన్నో చూసి ఉంటారు.

అయితే బుల్లెట్ మోటార్ సైకిల్ టెంపుల్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది చదివిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. రాజస్థాన్‌లో ఇలాంటి ఆలయం ఉంది. పాలి-జోధ్‌పూర్ హైవేపై చోటిలా గ్రామంలో రోడ్డు పక్కన చెట్టు దగ్గర రాతి వేదిక నిర్మించబడింది. బుల్లెట్ మోటార్ సైకిల్ ఇక్కడ పార్క్ చేయబడింది. జోధ్‌పూర్ నుండి ఈ దేవాలయం దూరం 53 కిలోమీటర్లు.

Read Also:Congress- AAP Alliance: కాంగ్రెస్- ఆప్ మధ్య కుదిరిన సీట్ షేరింగ్.. ఏ రాష్ట్రంలో ఎన్నో తెలుసా..?

రాజస్థాన్‌లోని ఈ బుల్లెట్ టెంపుల్ కథ చాలా ఆసక్తికరంగా.. ఒకింత విచారంగా ఉంది. 1988లో ఇక్కడ ఓం సింగ్ రాథోడ్‌ అనే వ్యక్తి రాత్రి పూట తన స్నేహితుడితో కలిసి బుల్లెట్‌ బైక్‌పై పాలి జిల్లాలోని బాంగ్డీ నుండి చోటిలా అనే ఊరికి వెళ్తున్నాడు. ఆ సమయంలో బైక్ అదుపు తప్పి ఓ చెట్టును ఢీకొనడంతో ఓం సింగ్ రాథోడ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తన స్నేహితుడు బతికిపోయాడు.

ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు మోటార్‌సైకిల్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. కానీ రాత్రి ఓం సింగ్ రాథోడ్ ప్రమాదం జరిగిన చోటకే మోటార్‌సైకిల్ వచ్చింది. దీంతో పోలీసులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మోటార్‌సైకిల్‌ను మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ఈసారి చైన్‌తో కట్టేశారు. గొలుసులో కట్టి ఉన్న మోటార్ సైకిల్ ఎక్కడికీ వెళ్లలేక రాత్రి దానంతట అదే స్టార్ట్ చేసిందని చెబుతున్నారు.

Read Also:Yadadri Power Plant: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన భట్టి విక్రమార్క..

దీంతో అక్కడి స్థానికులు ఆ బైక్‌కి గుడి కట్టి దాన్ని ‘బుల్లెట్ బాబా’ ఆలయంగా పిలవటం ప్రారంభించారు. ఆలయం చుట్టూ ఉన్న గ్రామస్తులు ఓం సింగ్ రాథోడ్‌ను తమ దేవుడిగా భావిస్తారు. అయితే ఇక్కడి ప్రజలే కాకుండా రాజస్థాన్‌లోని సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి బుల్లెట్‌ను పూజిస్తారు. దీంతో పాటు బైక్‌పై ఎర్రటి దారం కడతారు. ఇక్కడ తమ కోరికలు నెరవేరుతాయని ప్రజలు అంటున్నారు. నేటికీ అతని ఆత్మ హైవేపై ప్రమాదాల నుండి ప్రజలను కాపాడుతుందని నమ్ముతారు.