Bomb Threat Mail: రాజస్థాన్ లోని జైపూర్‌తో సహా ఇతర రైల్వే స్టేషన్‌లకు బుధవారం బాంబు దాడి చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అందిన సమాచారం ప్రకారం.. హనుమాన్‌ఘర్ జంక్షన్ లోని స్టేషన్ సూపరింటెండెంట్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుండి వచ్చిన లేఖ జైష్-ఎ-మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ పేరుతో బెదిరింపును జారీ చేసింది. దాంతో స్టేషన్ సూపరింటెండెంట్ బెదిరింపు గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత భారీ బందోబస్తును ప్రారంభించి స్టేషన్ మొత్తం వెతికారు పోలీసులు.
Irani Cup 2024: సెంచరీతో చెలరేగిన సర్పరాజ్ ఖాన్..
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్, బికనీర్ , జోధ్‌పూర్, కోటా, బుండి, ఉదయపూర్, జైపూర్‌తో సహా అనేక స్టేషన్లలో బాంబు పేలుడు బెదిరింపు లేఖలో ఉంది. సరిహద్దు భద్రతా దళం (BSF), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది స్థానిక పోలీసులతో కలిసి హనుమాన్‌ఘర్ జంక్షన్‌లో సోదాలు నిర్వహించారు. అయితే అక్కడ అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించలేదని, కాకపోతే అదనపు పోలీసు సిబ్బందిని మోహరించి, కట్టుదిట్టమైన నిఘా నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
Nabard 2024: 10వ తరగతి ఉత్తీర్ణులైతే చాలు.. నాబార్డ్‌లో ఉద్యోగాలు..
లేఖ కవరులో హనుమాన్ గఢ్ పోస్ట్ ఆఫీస్ ముద్ర ఉంది. అందులో గీత కాగితంపై వ్యక్తి జైష్ అని పేర్కొన్నాడు. తనను తాను జమ్మూ కాశ్మీర్ ఏరియా కమాండర్ మహ్మద్ సలీం అన్సారీ అని పేర్కొన్నాడు. జమ్మూకశ్మీర్‌లో హతమైన జిహాదీలకు ప్రతీకారం తీర్చుకుంటామని లేఖలో రాశారు. నవంబరు 2న ఉజ్జయిని మహాకాల్ ఆలయాన్ని పేల్చివేస్తామని లేఖలో బెదిరించారు. ప్రస్తుతం ఈ లేఖ విచారణలో ఉంది. ఇకపోతే జైష్ పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ. దీని చీఫ్ మసూద్ అజార్ .