Rajasthan Elderly Couple Dies Hours Apart in Barmer: మనిషికి ఎన్ని బంధాలున్నా సరే.. కడవరకు తోడుగా నిలిచేది జీవిత భాగస్వామితో ముడిపడిన బంధం మాత్రమే. అందరూ మనల్ని వదిలేసి వెళ్లినా సరే.. భాగస్వామి ఒక్కరే మన వెన్నంటి ఉంటారు. కష్టసుఖాల్లో సమానంగా పాలు పంచుకుంటారు. మరి అలాంటి తోడు.. మరణం సంభవించి దూరమైతే.. మిగిలిన వారి బాధను వర్ణించడానికి మాటలు చాలవు. ఇక కొందరైతే తమ తోడు లేని లోకంలో ఉండటం ఎందుకని బెంగ పెట్టుకుని మరణిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.
READ MORE: Rajasthan: లక్కంటే నీదే గురూ.. లాటరీలో రూ.11 కోట్లు గెలిచిన కూరగాయల వ్యాపారి కానీ..
బార్మర్ జిల్లాలోని మహాబర్ గ్రామం నివాసి అయిన జుగతారాం భార్య 89 ఏళ్ల హిరోన్ దేవి శుక్రవారం సాయంత్రం మరణించారు. కుటుంబ సభ్యులు ఈ సంఘటన గురించి బంధువులు, ఇతరులకు సమాచారం అందించారు. ఆ భర్త మాత్రం తన భార్య మరణాన్ని జీర్ణించుకోలేక పోయాడు. ఈ వయసులో తనని ఒంటరిగా వదిలి వెళ్లడంతో బెంగ పెట్టుకున్నాడు. బంధువులు గ్రామానికి వచ్చే సరికి హిరోన్ దేవి భర్త జుగతారాం (90) సైతం తుది శ్వాస విడిచారు. కేవలం నాలుగు గంటల తేడాతో ఈ దంపతుల మరణాలు గ్రామంలో విషాదాన్ని నింపాయి. జిల్లా వ్యాప్తంగా హీర్ దేవి, జుగతారాం దంపతుల గురించి చర్చించుకుంటున్నారు. జీవించి ఉన్నప్పుడు, భార్యాభర్తలు ఇతరుల సుఖదుఃఖాలను పంచుకున్నారు. చివరికి చావులో సైతం తోడుగా నిలిచారు. అయితే.. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఒక కుమారుడు రణారామ్ వడ్రంగిగా పనిచేస్తున్నాడు. మరొకరు ఉదారామ్ డ్రైవర్. మూడవవాడు కామారామ్ సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.
READ MORE: Bangladesh: అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ! 1971 యుద్ధం తర్వాత తొలిసారి బంగ్లాకు పాక్ యుద్ధనౌక..
