NTV Telugu Site icon

Heart Attack : పాఠశాలలో ఒక్కసారిగా కూలబడిపోయిన విద్యార్థి.. వైరల్ వీడియో..

Cc Camera

Cc Camera

Heart Attack : రాజస్థాన్‌లోని దౌసాలో పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి గుండెపోటుతో మరణించిన షాకింగ్ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. మరణించిన విద్యార్థి పేరు యతేంద్ర ఉపాధ్యాయ. అతని వయస్సు కేవలం 16 సంవత్సరాలు. ఇక్కడ విశేషమేమిటంటే.. అతను తన పుట్టినరోజును ఒక రోజు ముందు జరుపుకున్నాడు. విద్యార్థి గుండె జబ్బుతో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బండికుయ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో పాఠశాల వరండా దాటి తరగతి లోపలికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో ఒక్కసారిగా వరండాలో పడిపోయి మళ్లీ లేవలేని స్థితిలో పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. అందులో యతేంద్ర వరండాలో పడిపోతున్నట్లు కనిపించింది. దీని తరువాత, సమీపంలో కూర్చున్న పాఠశాల ఉద్యోగి అతని వైపు పరిగెత్తాడు. ఆపై అతనిని మేల్కొలపడానికి ప్రయత్నిస్తున్నాడు. అయినాకానీ ఎటువంటి కదలిక లేకపోవడంతో పాఠశాల నిర్వాహకులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

Viral Video: ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుందంటే ఏమో అనుకున్నాం.. అది ఇదే కాబోలు..

ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు పవన్ జర్వాల్ మాట్లాడుతూ.. పాఠశాల సిబ్బంది బాలుడిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. తీసుకొచ్చేసరికి గుండె కొట్టుకోవడం లేదు. మేము CPR (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) చేసాము. కానీ ప్రయోజనం లేదు. విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 3 సంవత్సరాల క్రితం కూడా విద్యార్థికి గుండె సంబంధిత సమస్య ఉందని, దాని కారణంగా అతను 15 రోజుల పాటు JK లోన్ ఆసుపత్రిలో ఉన్నాడని తెలిపాడు. మృతదేహాన్నీ పోస్టుమార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందించడంతో విద్యార్థిని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Kim Jong Un’s sister: అలా చేశారో విధ్వంసమే.. సౌత్ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్..!

దీనిపై సమాచారం ఇస్తూ బండికుయ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ప్రేమ్ చంద్ మాట్లాడుతూ.. యతేంద్ర ఉపాధ్యాయ్‌ కు గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. అయితే., బాలుడి కుటుంబ సభ్యులు పోస్టుమార్టంకు అంగీకరించలేదు. ప్రైవేట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఉపాధ్యాయ్‌ ను బండికుయ్ సబ్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారని అతను చెప్పాడు. విద్యార్థి అంత్యక్రియలు స్వగ్రామమైన అల్వార్‌లో నిర్వహిస్తామని విద్యార్థి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.