NTV Telugu Site icon

RR vs CSK : చెన్నైపై రాజస్థాన్‌ గెలుపు.. 32 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్‌.

Rr

Rr

ఐపీఎల్‌ 16వ సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. అయితే నేడు జైపూర్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌ దిగిన రాజస్థాన్‌ నిర్టీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 స్కోర్‌ను చెన్నై ముందు ఉంచింది. అయితే.. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్ ( 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు ) అర్థశతకంతో రాణించగా.. ఆఖర్ లో ధ్రువ్ జురెల్ ( 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 34 పరుగులు ), దేవదత్ పడిక్కల్ ( 13 బంతుల్లో 5 ఫోర్లు 27 పరుగులు నాటౌట్ ) ధాటిగా ఆడడంతో స్కోర్ 200 పరుగులు దాటింది. అయితే.. ఆతరువాత 203 లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే ఆటగాళ్లలో.. కాన్వే 8 పరుగులకే ఔట్ అయ్యాడు.

Also Read : Off The Record: రాజమండ్రి సిటీ టిక్కెట్‌ కోసం టీడీపీలో వార్‌..! జనసేనకు ఇస్తే పరిస్థితేంటి..?

ఆడ‌మ్ జంపా బౌలింగ్‌లో సందీప్ శ‌ర్మ క్యాచ్ ప‌ట్ట‌డంతో చెన్నై తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆతరువాత.. 47 ప‌రుగులు చేసిన రుతురాజ్ ఆడ‌మ్ జంపా బౌలింగ్‌లో ప‌డిక్క‌ల్ క్యాచ్ ప‌ట్ట‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో ర‌హానే(15) భారీ షాట్‌కు య‌త్నించ‌గా బ‌ట్ల‌ర్ క్యాచ్ ప‌ట్ట‌డంతో ఔట్ అయ్యాడు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో చెన్నై మూడు వికెట్లు కోల్పోయింది. ప‌ద‌కొండో ఓవ‌ర్ వేసిన అశ్విన్ ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీశాడు. రెండో బంతికి ర‌హానేను ఔట్ చేయ‌గా నాలుగో బంతికి హోల్డ‌ర్ క్యాచ్ అందుకోవ‌డంతో రాయుడు(0) పెవిలియ‌న్ చేరుకున్నాడు. అయితే.. చెన్నై బ్యాట‌ర్లలో శివ‌మ్ దూబే 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాది 52 నాటౌట్‌ గా నిలిచినా.. నిర్ణీత ఓవర్లలో సీఎస్కే 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో.. రాజస్థాన్‌ రాయల్స్‌ 32 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది.

Also Read : Bhatti Vikramarka : ఆదిలాబాద్‌లో అడవి బిడ్డలు అత్యంత ధైర్యవంతులు