Rajashekar : టాలీవుడ్ లో మళ్లీ రచ్చ చేస్తున్న ‘మగాడు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajashekar : ఏ ఇండస్ట్రీకి చెందిన సినిమా అయినా సరే టైటిల్ చాలా ముఖ్యం. అలాంటి టైటిల్స్ పవర్ ఫుల్‌గా ఉంటేనే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. కనుక ఒక సినిమా టైటిల్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సినిమా కథను, ఇతరత్రా అంశాలను దృష్టిలో పెట్టుకుని టైటిల్‌ను ఖరారు చేస్తారు. కథతో సంబంధం ఉండటంతో పాటు, ప్రేక్షకులకు క్యాచీగా, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా క్రియేటివ్‌గా టైటిల్స్ పెట్టడంలో ఈ కాలం దర్శకులు ముందు ఉంటారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అంతే కాకుండా కథకు కుదిరితే పాత టైటిల్స్ ను కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. 35 ఏళ్ల క్రితం వచ్చిన ‘మగాడు’ సినిమా టైటిల్‌ను మళ్లీ వినియోగించేందుకు యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ రెడీ అవుతున్నారు. రాజశేఖర్ హీరోగా కె మధు దర్శకత్వంలో మగాడు సినిమా వచ్చింది. మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన మూన్నం మూర సినిమాకు రీమేక్ గా సినిమా రూపొందింది. తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమాతో రాజశేఖర్ జనాల్లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఒక కిడ్నాప్ డ్రామాగా ఆ సినిమా రూపొందింది. ఆ టైటిల్‌తో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రాబోతుందన్న వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో అది సాధ్యం కాలేదు. మహేష్ బాబు మగాడు సినిమా రాలేదు. దాంతో మగాడు టైటిల్ గురించి అంతా మర్చిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ టైటిల్ గురించి చర్చ మొదలైంది.
Read Also:IPL 2025 MS Dhoni: ఐపీఎల్ 2025లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. సీఎస్‌కే సమాధానం ఇదే!
Also Read
- FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనలు ఉల్లంఘన..
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
- Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
- AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
దాదాపు 35 ఏళ్ల తర్వాత మళ్లీ రాజశేఖర్ అదే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ సాధినేని దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న సినిమాకు మగాడు టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మగాడు సినిమాతో రాజశేఖర్ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పవన్ సాధినేని ఇటీవల చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయిన నేపథ్యంలో ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. రాజశేఖర్ హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇటీవల నితిన్ హీరోగా రూపొందిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలో కనిపించాడు. రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Read Also:MLC Jeevan Reddy: జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య..
తాజావార్తలు
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనలు ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
-
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!