NTV Telugu Site icon

Rajanikanth : బెంగళూరు లోని బస్ డిపో ను సందర్శించిన తలైవా..

Whatsapp Image 2023 08 29 At 2.19.24 Pm

Whatsapp Image 2023 08 29 At 2.19.24 Pm

ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా అదిరిపోయే విజయం సాధించింది. అప్పటివరకు ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రజనీకాంత్ జైలర్ సినిమా తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. తలైవా ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేస్తున్నారు.ఇంతటి ఘన విజయం సాధించిన జైలర్ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కు మ్యూజిక్ మెయిన్ హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ ప్రతి సినిమా విడుదలకు ముందు హిమాలయ యాత్ర కు వెళ్తూ ఉంటారు. గత నాలుగేళ్లగా కరోనా కారణంగా హిమాలయ యాత్ర కు వెళ్లడం కుదరలేదు. దీనితో జైలర్ సినిమా విడుదలకు ముందు రోజు తలైవా హిమాలయాలకు వెళ్లారు. ఇటీవల హిమాలయ యాత్రను ముగించుకున్నారు.

తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు ఉదయం 11:30 గంటలకు దక్షిణ బెంగళూరులోని జయనగర్ ప్రాంతం లోని బీఎంటీసీ డిపోను రజనీకాంత్ ఆకస్మికంగా సందర్శించారు..జయనగర్ డిపోకు వెళ్లి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ)సిబ్బంది కి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు.బస్సు డ్రైవర్లు మరియు కండక్టర్‌ల ను అనుకోకుండా కలిసి రజినీకాంత్ వారినిఆశ్చర్యపరిచారు.బెంగళూరులోని బిఎమ్‌టిసి అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సూపర్‌స్టార్ బస్ డిపోను సందర్శించారు. అక్కడ వున్న మెకానిక్‌లు మరియు ఇతర కార్మికులు కూడా ఆయనతో సెల్ఫీలను తీసుకున్నారు.రజనీకాంత్ బీఎంటీసీ సిబ్బంది తో సుమారు 15 నిమిషాల పాటు సంభాషించడం జరిగింది..రజనీకాంత్ మొదట నటుడు కాకముందు బీఎంటీసీ లో కండక్టర్ గా పని చేసాడు.బస్ లో ఎంతో స్టైల్ గా టికెట్స్ ఇస్తున్న రజనీనీ చూసి దర్శకుడు బాల చందర్ గారు ఆశ్చర్యపోయి ఆయనను సినిమాలలోకి పరిచయం చేసారు. రజనీకాంత్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు. దీనితో నేడు రజనీకాంత్ బీఎంటీసీ సిబ్బందినీ కలవడం తో అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు.