Rajamouli : ధురంధర్ దారిలో వారణాసి.. వర్కౌట్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ సినిమా గర్వించదగ్గ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ప్రస్తుతం దర్శక దిగ్గజం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ మరియు విడుదల విషయంలో రాజమౌళి.. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ధురంధర్‌ను ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి వారణాసి సినిమా ఒక్కటే పార్ట్‌గా రానుందని స్వయంగా రాజమౌళినే క్లారిటీ ఇచ్చారు.
కానీ ఇప్పుడు కథా బడ్జెట్ దృష్ట్యా రెండు భాగాలుగా చేయాలని భావిస్తున్నారట. అంతేకాదు పార్ట్ 2ని తక్కువ గ్యాప్‌లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇటీవల బాలీవుడ్‌లో వచ్చిన ‘ధురంధర్’ రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్‌ను ఒకేసారి పూర్తి చేసి కేవలం మూడు నెలల వ్యవధిలోనే పార్ట్ 1 పార్ట్ 2లను విడుదల చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు రాజమౌళి కూడా వారణాసి షూటింగ్‌ను ఏకధాటిగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత సినిమాను రెండు భాగాలుగా విభజించి.. కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది జక్కన్న ప్లాన్‌గా తెలుస్తోంది. గతంలో ‘బాహుబలి’ రెండు భాగాలకు గాను దాదాపు రెండేళ్ల సమయం తీసుకున్నాడు రాజమౌళి. కానీ ఈసారి ప్రేక్షకులు కథను మర్చిపోకుండా ఆ ఎగ్జైట్‌మెంట్‌ను అలాగే కొనసాగించేందుకు ఈ సరికొత్త నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయినా కూడా సినిమా అనుకున్న సమయానికి 2027 ఏప్రిల్ 7న థియేటర్లోకి రావడం పక్కా అని టాక్.
Also Read
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
- IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
తాజావార్తలు
-
Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క