Varanasi: మెక్సికోను షేక్ చేసిన రాజమౌళి వీడియో మెసేజ్.. ‘వారణాసి’ వరల్డ్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్!

Rajamouli Varanasi Ccxp Mexico Video,

Rajamouli Varanasi Ccxp Mexico Video,

మెక్సికో సిటీలో జరుగుతున్న అతిపెద్ద పాప్ కల్చర్ ఫెస్టివల్ CCXP MX 2026లో ‘వారణాసి’ టీమ్ సందడి చేసింది. ఈ వేదికపై దర్శకుడు రాజమౌళి పంపిన ప్రత్యేక వీడియో మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన మొదటి గ్లింప్స్‌ను ప్రదర్శించగా, హాలీవుడ్ స్థాయి విజువల్స్‌కు అక్కడి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. రాజమౌళి తన వీడియో సందేశంలో మెక్సికో అభిమానులకు అభివాదం చేస్తూ.. ‘వారణాసి కేవలం ఒక సినిమా కాదు, అదొక అడ్వెంచర్. ఇండియన్ మైథాలజీని, గ్లోబల్ స్టాండర్డ్స్ యాక్షన్‌తో కలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం” అని పేర్కొన్నారు.

ముఖ్యంగా తన హీరో మహేశ్ బాబు గురించి ప్రస్తావిస్తూ, ప్రపంచం చూడని సరికొత్త మహేశ్‌ను ఈ సినిమాలో చూస్తారని భరోసా ఇచ్చారు. కాగా ఈ ఈవెంట్‌లో ప్రదర్శించిన గ్లింప్స్‌లో కొన్ని క్రేజీ ఎలిమెంట్స్ బయటకు వచ్చాయి. మహేశ్ బాబు గడ్డం, పొడవాటి జుట్టుతో మహేశ్ మునుపెన్నడూ లేని విధంగా చాలా రఫ్ అండ్ టఫ్ గా కనిపించారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో తీసిన కొన్ని విజువల్స్ హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయని టాక్. మొత్తనికి రాజమౌళి మార్క్ గ్రాఫిక్స్, కీరవాణి బీజీఎం ఈ గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ‘RRR’తో ఆస్కార్ గెలిచిన తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో, హాలీవుడ్ మేజర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ పై కన్నేశారు. మెక్సికోలో ఈ స్థాయి స్పందన రావడం సినిమా గ్లోబల్ మార్కెట్ కు గొప్ప సంకేతం. 2027 ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.