Director Rajamouli: బాహుబలి, ట్రిపుల్ ఆర్ సినిమాల తర్వాత రాజమౌళి ఓ రేంజ్ కెళ్లిపోయారు. అంతర్జాతీయంగా ఆయన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘన విజయం సాధించిందో, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని రికార్డులు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ట్రిపుల్ ఆర్ మూవీతో హాలీవుడ్ దర్శకులను మెప్పించారు జక్కన్న. తనదైన మార్క్ స్క్రీన్ ప్లే, టేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ బాక్సాఫీసు రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇక మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్ లో ప్రమోట్ చేస్తూ అక్కడి ఫిలిం ఫెస్టివల్స్‌లో పాల్గొంటున్నాడు. అమెరికా మీడియా, ప్రేక్షకులు జక్కన్నతో ఇంట్రాక్ట్ కావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా రాజమౌళికి మరో అరుదైన గౌరవం లభించింది.
Read Also: Chhattisgarh Encounter: చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ ఆరుగురు నక్సల్స్ మృతి
అమెరికాలో లార్జెస్ట్ సర్కులేటెడ్ పేపర్స్ లో ఒకటైన లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రికలో జక్కన్న పై ప్రత్యేక కథనం రాశారు. పత్రికలోని ముందు పేజీ పూర్తిగా రాజమౌళి ఆర్టికల్ కనిపిస్తుంది. అందులో జక్కన్నను.. ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని ప్రశంసిస్తూ.. ఆర్ఆర్ఆర్ దర్శకుడికి భారీ అవకాశాలు అంటూ హెడ్ లైన్ ఇచ్చారు. కాగా, ఆస్కార్ అవార్డులకు ముందు ప్రదానం చేసే గవర్నర్ అవార్డుల కార్యక్రమం నిమిత్తం రాజమౌళి ఇటీవల అమెరికా వెళ్లారు. ఈ నేపథ్యంలో, అమెరికా మీడియాలో రాజమౌళిపై పేపర్లో కథనం రావడం రాణించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళి అమెరికన్ యాక్షన్ సినిమాలు చూస్తూ పెరిగాడని, ఇప్పుడు యావత్ అమెరికా రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రం చూస్తూ ఊగిపోతోందని తన కథనంలో పేర్కొంది. రాజమౌళిపై లాస్ ఏంజెలిస్ టైమ్స్ లో కథనం రావడం పట్ల అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.
💥💥💥💥💥💥💥💥 @latimes 🤩 pic.twitter.com/4rLOGCFVEa
— RRR Movie (@RRRMovie) November 26, 2022