Rajamouli :దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో “బాహుబలి” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు.ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ లభించింది.బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది.అయితే ప్రపంచవ్యాప్తంగా బాహుబలికి వున్నక్రేజ్ చూసాక ఈ సినిమాకు మూడో పార్ట్ తీసుకురావాలని మేకర్స్ భావించారు .కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు.అయితే బాహుబలి సిరీస్ ను కొనసాగించండి అని చాల మంది అభిమానులు అడిగారు.వారందరికోసం “బాహుబలి : క్రౌన్ ఆఫ్ బ్లడ్ “ని మేకర్స్ రూపొందించారు.ఇది ఒక యానిమేటెడ్ సిరీస్.రీసెంట్ గా రాజమౌళి ఈ సిరీస్ ను లాంచ్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించి పలు ఆసక్తికర విషయాలు తెలియజేసారు.
Read Also : Kajal Aggarwal : ఆ సమయంలో కాజల్ అన్న మాటకు షాక్ అయిన దర్శకుడు తేజ..?
రాజమౌళి మాట్లాడుతూ నా జీవితంలో ‘బాహుబలి’ సినిమా చేసిన మ్యాజిక్ ఎప్పటికీ కూడా మరిచిపోలేను. ఆ సిరీస్‌ని కొనసాగించమని చాలామంది ప్రేక్షకులు అడిగారు. వారందరికోసం ‘బాహుబలి : క్రౌన్ ఆఫ్ బ్లడ్’ని రూపొందించాం.తొమ్మిది ఎపిసోడ్స్‌తో ఈ నెల 17 నుంచి డిస్నీ, హాట్‌స్టార్ వేదికగా ఈ యానిమేషన్ సిరీస్ ప్రసారం కానుందని ఆయన తెలిపారు.ఈ యానిమేటెడ్ సిరీస్ ను అందరు చూసి ఎంజాయ్ చేయండి.’ అని ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.ఆ వీడియోలో ‘ ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’కు పనిచేసిన గ్రాఫిక్ ఇండియాతో ఈ సిరీస్ ను రూపొందించినట్లు తెలిపారు. ఈ సిరీస్ తెలుగుతో పాటు మరో ఆరు భాషల్లో అందుబాటులోకి రానుందని రాజమౌళి తెలిపారు.