Rajahmundry: రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో స్థానానికి వెళ్లి ఇద్దరు భవానీలు గల్లంతు అయ్యారు. భవాని మాల వేసుకున్న గుబ్బల బాపిరాజు, రాయుడు వీరబాబు గోదావరిలో గల్లంతు అయ్యారు. గల్లంతయిన వీరిద్దరూ బావ బామ్మర్దులు. బాపిరాజు రాజమండ్రి ప్రకాష్ నగర్ లోని కొత్తగా ఏర్పాటు చేసిన హాస్పిటల్లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నా రాయుడు వీరబాబు హైదరాబాదులోని ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడు. భవాని మాల వేసుకోవడానికి ఇటీవలే రాజమండ్రి వచ్చాడు. ఈ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి స్థానానికి వచ్చి పుష్కర్ ఘాట్‌లో స్థానానికి దిగారు. నదిలో లోతు ఎంత ఉన్నదో తెలియక ఊబిలోకి దిగి గల్లంతయ్యారు.
READ MORE: IND vs PAK Final: పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్.. అభిషేక్ శర్మ సెంచరీ పక్కా!
గల్లంతైన వారి కోసం స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోదావరిలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న కారణంగా ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో నదిలో స్థానానికి వెళ్లి వీరిద్దరూ గల్లంతయ్యారని స్థానికుల ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పుష్కర్ ఘాట్ గేటులన్నీ మూసివేశారు. ఎవరిని స్థానాలకు వెళ్ళవద్దని పోలీస్ గస్తీ ఏర్పాటు చేశారు. దీంతో రాజమండ్రిలోని భవానీలంతా శివలింగం వద్ద ఉన్న జల్లు స్థానాలు చేస్తున్నారు.
READ MORE: Manchu Manoj : అర్జున్ రెడ్డి సినిమా మిస్ చేసుకున్న మంచు మనోజ్..
